
మరో 30 రోజుల పాటు లఖ్వీ నిర్బంధం
ఇస్లామాబాద్ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మన్ లఖ్వీ నిర్బంధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పొడిగించింది. రావల్పిండి జైల్లో ఉన్న అతడిని మరో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉండనున్నాడు. ఈమేరకు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన చేసింది. కాగా లఖ్వీని వెంటనే విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే.