Lakhvi
-
‘లఖ్వీ వ్యవహారాన్ని చర్చిస్తాం’
న్యూయార్క్/న్యూఢిల్లీ: ముంబైలో ఉగ్రవాద దాడుల సూత్రధారి జకీవుర్ రహమాన్ లఖ్వీని పాకిస్తాన్ జైలునుంచి విడుదల చేసిన అంశంపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) కమిటీ భారత్కు హామీ ఇచ్చింది. లఖ్వీ విడుదల పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో మండలి దీనిపై దృష్టిసారించింది. తదుపరి సమావేశంలో దీనిపై చర్చిస్తామని భారత్కు చెప్పింది. అల్కాయిదా, తదితర ఉగ్రవాద సంస్థలపై ఆంక్షల వ్యవహారాన్ని పర్యవేక్షించే మండలి కమిటీ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా పాక్లో లఖ్వీని విడుదల చేశారంటూ ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ, ఈ కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
లఖ్వీ విడుదలపై చర్చిస్తాం: యూఎన్
ముంబై దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారత్ యూఎన్(యునైటెడ్ నేషన్స్)ని ఆశ్రయించింది. యూనైటెడ్ నేషన్ భారతశాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ ప్రస్తుత యూఎన్ సాంక్షన్స్ కమిటీ చైర్మన్ జిమ్ మెక్లేకి లేఖ రాశారు. అందులో.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా యూఎన్ఎస్సీ చేసిన తీర్మానాలని ఉల్లంఘించేలా లఖ్వీ విడుదల ఉందని పేర్కొన్నారు. తదుపరి జరగబోయే సమావేశంలో లఖ్వీ విడుదల అంశాన్ని చర్చిస్తామని యూఎన్ఎస్సీ కమిటీ భారత్కు హామీ ఇచ్చింది. లఖ్వీ పాకిస్తాన్ జైలు నుంచి ఏప్రిల్ 11న విడుదలయ్యాడు. అతని నిర్బంధాన్ని లాహోర్ హైకోర్టు తప్పుబట్టడంతో ఆరేళ్ల జైలు జీవితం నుంచి లఖ్వీకి విముక్తి కలిగింది. కోర్టు నుంచి ఉత్తర్వులు అందగానే రావల్పిండిలోని అడియాల జైలు అధికారులు లఖ్వీని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. -
ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ విడుదల
-
లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి..
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది. శాంతిభద్రతల చట్టం కింద జైలులో ఉన్న అతడిని విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించడం తెలిసిందే. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో... పాక్ తిరిగి నిర్బంధంలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాలపై శనివారం లఖ్వీని విడుదల చేసిన వెంటనే తిరిగి శాంతి భద్రతల చట్టం కింద అదుపులోకి తీసుకుంది. మరో 30 రోజులు లఖ్వీని రావల్పిండి జైల్లోనే ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇదే చట్టం కింద ప్రభుత్వం లఖ్వీని రెండుసార్లు అదుపులోకి తీసుకోగా.. ఆ రెండు సార్లూ కోర్టులు నిర్బంధాన్ని తప్పుబట్టి విడుదల చేయాల్సిందిగా ఆదేశించాయి. -
మరో 30 రోజుల పాటు లఖ్వీ నిర్బంధం
ఇస్లామాబాద్ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మన్ లఖ్వీ నిర్బంధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పొడిగించింది. రావల్పిండి జైల్లో ఉన్న అతడిని మరో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉండనున్నాడు. ఈమేరకు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన చేసింది. కాగా లఖ్వీని వెంటనే విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే. -
లఖ్వీ నిర్బంధం పొడగింపు
కరాచీ: ముంబై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి లక్వీ నిర్బంధాన్ని పాకిస్థాన్ మరో 30 రోజుల పాటు పొడగించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒబామా భారత్ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అదుపులో ఉన్న లక్వీ 2008లో ముంబై దాడికి కుట్ర పన్నాడు. అతణ్ని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
లఖ్వీ బెయిల్ ను సవాల్ చేసిన పాక్
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీమర్ రెహ్మాన్ లఖ్వీ కి ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్నిసవాల్ చేస్తూ పాకిస్థాన్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నిర్బంధంలో ఉన్న లఖ్వీని విడుదల చేయాల్సిందిగా ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అతను డిసెంబర్ 18 వ తేదీన బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే దీన్ని సవాల్ చేసిన పాక్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా మరోకేసులో లఖ్వీని మంగళవారం పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
మరో కేసులో లఖ్వీ అరెస్ట్
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి అయిన జకీమర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు. ఈ దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ రావడం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం అతడిని ముందస్తు నిర్బంధంలో ఉంచింది. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఈ నిర్బంధాన్ని తప్పుబట్టి, విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో లఖ్వీని విడుదల చేయడానికి కొద్ది గంటల ముందు... ఆరేళ్ల కిందటి కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అన్వర్ అనే వ్యక్తిని ఆరేళ్ల కింద కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపిస్తూ.. సోమవారమే ఈ కేసును నమోదు చేయడం గమనార్హం. దీంతో లఖ్వీని ఈ కేసులో అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా... న్యాయమూర్తి పోలీసు కస్టడీకి ఇచ్చారు. అనంతరం పోలీసులు లఖ్వీని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు. -
లఖ్వీతో నాకు పడదు:కరీమ్ టుండా
న్యూఢిల్లీ: తాను లష్కరే తోయిబాలో ఉన్నత స్థానానికి ఎదగకుండా దాని కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ తీవ్రంగా అడ్డుపడ్డాడని ఇటీవల అరెస్టయిన ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ టుండా పోలీసులకు చెప్పాడు. లష్కరే తోయిబా భారత్లో విస్తరించడానికి తానే కారణమైనప్పటికీ లఖ్వీ తన అవకాశాలను దూరంచేశాడన్నాడు. అందుకే లఖ్వీ అంటే తనకు ద్వేషమని అతడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాంబుల తయారీలో నిష్ణాతుడైన 70 ఏళ్ల టుండాను పోలీసులు ఈనెల 16న అరెస్ట్చేసిన విషయం తెలిసిందే. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన లఖ్వీ దాడుల వ్యూహరచన సమయంలో తనను దూరంగా పెట్టాడని టుండా చెప్పినట్లు అతడిని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. లఖ్వీతో ఉన్న ఆర్థిక విభేదాల కారణంగా లష్కరే అగ్రనాయకత్వం కూడా ముంబై ఆపరేషన్ సమయంలో తనను పక్కన పెట్టి యువకులైన అబూ జుందాల్ లాంటి వాళ్లను దగ్గరకు తీశారన్నాడు. దీని గురించి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ తనకు చెప్పాడని... ఇక భారత్ నకిలీ నోట్ల పంపిణీపై దృష్టి సారించమని సూచించాడన్నాడు.