మరో కేసులో లఖ్వీ అరెస్ట్ | Lakhvi rearrested; Pak draws India's ire | Sakshi
Sakshi News home page

మరో కేసులో లఖ్వీ అరెస్ట్

Published Wed, Dec 31 2014 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

మరో కేసులో లఖ్వీ అరెస్ట్

మరో కేసులో లఖ్వీ అరెస్ట్

ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి అయిన జకీమర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు.  ఈ దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ రావడం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం అతడిని ముందస్తు నిర్బంధంలో ఉంచింది. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఈ నిర్బంధాన్ని తప్పుబట్టి, విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. 

దీంతో లఖ్వీని విడుదల చేయడానికి కొద్ది గంటల ముందు... ఆరేళ్ల కిందటి  కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.  అన్వర్ అనే వ్యక్తిని ఆరేళ్ల కింద కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపిస్తూ.. సోమవారమే ఈ కేసును నమోదు చేయడం గమనార్హం. దీంతో లఖ్వీని ఈ కేసులో అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా... న్యాయమూర్తి పోలీసు కస్టడీకి ఇచ్చారు. అనంతరం పోలీసులు లఖ్వీని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement