ముంబైలో ఉగ్రవాద దాడుల సూత్రధారి జకీవుర్ రహమాన్ లఖ్వీని పాకిస్తాన్ జైలునుంచి విడుదల చేసిన అంశంపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) కమిటీ భారత్‌కు హామీ ఇచ్చింది.
న్యూయార్క్/న్యూఢిల్లీ: ముంబైలో ఉగ్రవాద దాడుల సూత్రధారి జకీవుర్ రహమాన్ లఖ్వీని పాకిస్తాన్ జైలునుంచి విడుదల చేసిన అంశంపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) కమిటీ భారత్‌కు హామీ ఇచ్చింది. లఖ్వీ విడుదల పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో మండలి దీనిపై దృష్టిసారించింది. తదుపరి సమావేశంలో దీనిపై చర్చిస్తామని భారత్‌కు చెప్పింది. అల్‌కాయిదా, తదితర ఉగ్రవాద సంస్థలపై ఆంక్షల వ్యవహారాన్ని పర్యవేక్షించే మండలి కమిటీ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా పాక్‌లో లఖ్వీని విడుదల చేశారంటూ ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ, ఈ కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.