the Islamabad High Court
-
లఖ్వీ విడుదలకు పాక్ కోర్టు ఆదేశం
పాక్ హైకమిషనర్‌ను పిలిపించి భారత్ నిరసన ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మాన్ లఖ్వీని వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణ కింద లఖ్వీని నిర్బంధంలో ఉంచడాన్ని తప్పుబట్టింది. రావల్పిండి జైల్లో ఉన్న లఖ్వీ... కోర్టు ఆదేశాలపై శనివారం విడుదలయ్యే అవకాశముంది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. లఖ్వీకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలను పాక్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించలేదని ఆగ్రహించింది. అతన్ని విడుదల చేయడం ప్రమాదకరమని హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజూ అన్నారు. భారత విదేశాంగ కార్యదర్శి అనిల్ వాధ్వా(తూర్పు) ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ బాసిత్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేశారు. ముంబై దాడుల కేసులో లఖ్వీకి పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు డిసెంబర్లో బెయిలివ్వడం తెలిసిందే. దీన్ని భారత్ వ్యతిరేకించడంతో శాంతి భద్రతల పరిరక్షణ కింద పాక్ ప్రభుత్వం అతడిని నిర్బంధించింది. లఖ్వీ పైకోర్టులో సవాలు చేయగా... విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.లఖ్వీని విడుదల చేసిన అధికారులు.. వెంటనే అదే చట్టం కింద మరోమారునిర్బంధించారు. కాగా, సంఝౌతా రైల్లో పేలుడు కేసు విచారణలో జాప్యం జరుగుం తోందని పాక్ సర్కారు ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించు కుని నిరసన తెలిపింది. -
లఖ్వీ బెయిల్ ను సవాల్ చేసిన పాక్
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీమర్ రెహ్మాన్ లఖ్వీ కి ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్నిసవాల్ చేస్తూ పాకిస్థాన్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నిర్బంధంలో ఉన్న లఖ్వీని విడుదల చేయాల్సిందిగా ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అతను డిసెంబర్ 18 వ తేదీన బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే దీన్ని సవాల్ చేసిన పాక్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా మరోకేసులో లఖ్వీని మంగళవారం పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
మరో కేసులో లఖ్వీ అరెస్ట్
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి అయిన జకీమర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు. ఈ దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ రావడం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం అతడిని ముందస్తు నిర్బంధంలో ఉంచింది. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఈ నిర్బంధాన్ని తప్పుబట్టి, విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో లఖ్వీని విడుదల చేయడానికి కొద్ది గంటల ముందు... ఆరేళ్ల కిందటి కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అన్వర్ అనే వ్యక్తిని ఆరేళ్ల కింద కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపిస్తూ.. సోమవారమే ఈ కేసును నమోదు చేయడం గమనార్హం. దీంతో లఖ్వీని ఈ కేసులో అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా... న్యాయమూర్తి పోలీసు కస్టడీకి ఇచ్చారు. అనంతరం పోలీసులు లఖ్వీని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు.