ముంబై దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారత్ యూఎన్(యునైటెడ్ నేషన్స్)ని ఆశ్రయించింది. యూనైటెడ్ నేషన్ భారతశాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ ప్రస్తుత యూఎన్ సాంక్షన్స్ కమిటీ చైర్మన్ జిమ్ మెక్లేకి లేఖ రాశారు. అందులో.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా యూఎన్ఎస్సీ చేసిన తీర్మానాలని ఉల్లంఘించేలా లఖ్వీ విడుదల ఉందని పేర్కొన్నారు. తదుపరి జరగబోయే సమావేశంలో లఖ్వీ విడుదల అంశాన్ని చర్చిస్తామని యూఎన్ఎస్సీ కమిటీ భారత్కు హామీ ఇచ్చింది.
లఖ్వీ పాకిస్తాన్ జైలు నుంచి ఏప్రిల్ 11న విడుదలయ్యాడు. అతని నిర్బంధాన్ని లాహోర్ హైకోర్టు తప్పుబట్టడంతో ఆరేళ్ల జైలు జీవితం నుంచి లఖ్వీకి విముక్తి కలిగింది. కోర్టు నుంచి ఉత్తర్వులు అందగానే రావల్పిండిలోని అడియాల జైలు అధికారులు లఖ్వీని విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
లఖ్వీ విడుదలపై చర్చిస్తాం: యూఎన్
Published Sun, May 3 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement