ఇస్లామాబాద్: లండన్‌లో వైద్యకోసం ఉంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ప్రభుత్వం అరెస్టు వారంట్లు జారీ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పాక్ ప్రభుత్వం.. లండన్‌లోని పాక్ హైకమిషనర్‌కు వీటిని పంపింది. హైకమిషనర్ వీటిని ఈనెల 22వ తేదీలోగా నవాజ్‌కు అందజేయాల్సి ఉంటుంది. అల్ అజీజియా మిల్స్ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆయనకు 8 వారాలపాటు లండన్ వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది. అయితే, ఆయన గడువు పొడిగించాలంటూ పెట్టుకున్న అర్జీని ఇటీవల కోర్టు తోసిపుచ్చింది. ఆయన్ను ఈనెల 22వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరు పరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: నవాజ్ షరీఫ్ ఫొటోలు లీక్!)
Comments
Please login to add a commentAdd a comment