Pakistani Rupee Value Fallen Heavily Against The US Dollar - Sakshi
Sakshi News home page

ఇ‍మ్రాన్‌ అరెస్ట్‌.. పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌

Published Fri, May 12 2023 9:02 PM | Last Updated on Fri, May 12 2023 9:07 PM

Pakistani Rupee Value Fallen Heavily Against The US Dollar - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఇమ్రాన్‌ కోర్టుకు హాజరుకాగా.. అల్‌ఖదీర్‌ ట్రస్ట్‌ భూకబ్జా కేసులో రెండు వారాలపాటు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు ఊరట ఇచ్చింది. అంతేకాదు.. మే 9వ తేదీ తర్వాత ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఏ కేసుల్లో ఆయన్ని అరెస్ట్‌ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.  దీంతో ఆయన ఎన్‌ఏబీ కస్టడీ నుంచి రిలీజ్‌ అయ్యారు.

ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. కాగా, ఇ‍మ్రాన్‌ అరెస్ట్‌ కారణంగా పాక్‌లో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. ఇ‍మ్రాన్‌ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు. వాహనాలను తగులబెట్టారు. తీవ్ర ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ క్రమంలో ఘర్షణలను నియంత్రించేందుకు ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే పాక్‌ రూపాయి మారకం విలువ 3.3శాతం కుంగి 300 వద్ద హిస్టరీలోనే రికార్డు స్థాయిలో కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం నాటి ట్రెడింగ్‌లో 285కు చేరుకుంది. డాలర్‌ బాండ్ల విలువ అమాంతం పెరిగి 33.44 శాతానికి చేరింది.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉ‍న్న పాకిస్తాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బ. కాగా, ఇటీవలి కాలంలో వరదలు, ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన విషయం తెలిసిందే. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్‌ కాలంలో కూడా ప్రజలు తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. విదేశీ మారకపు నిల్వలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అటు ఐఎంఎఫ్‌ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదలకు పాక్‌ చర్చలు జరుపుతున్నా వెంటనే నిధులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో, పాక్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్‌ అరెస్ట్‌ పాక్‌కు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. 

ఇది కూడా చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌కు బెయిల్‌.. మళ్లీ అరెస్ట్‌కు ఛాన్స్‌?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement