దిహేగ్: పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇప్పుడు ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకోవడం చట్టవిరుద్దమని కోర్టు పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని కోర్టు ఆదేశించింది.
వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, పాలస్తీనా అంశంపై తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్ పాలస్తీనా విషయంపై కీలక తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అధీనంలో తీసుకోవడం చట్ట విరుద్ధం. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి వెంటనే వైదొలగాలని పేర్కొంది. అక్కడ కాలనీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
''It is a big blow to Israel as a state, as an establishment, as a government, as settlers.''
Palestinian officials welcomed the International Court of Justice’s opinion that called for an end to Israel’s occupation of the Palestinian territories.
pic.twitter.com/pIzavp1ZGq— Rachael Swindon #WeAreCollective (@Rachael_Swindon) July 20, 2024
ఇదే సమయంలో 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్రమణలు కరెక్ట్ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే, వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెం ప్రాంతాలపై నియంత్రణ, సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. అన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని మండిపడింది. వెంటనే పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రావాలని ఆదేశించింది.
ఇక, అంతర్జాతీయ కోర్టు ఆదేశాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు స్పందించారు. కోర్టు తీర్పు హస్యాస్పదమని ఖండించారు. ఆక్రమిత మూడు ప్రాంతాలు యూదుల చారిత్రాక మాతృభూమిలో భాగమన్నారు. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టబడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. కోర్టు చారిత్రాక విషయాలను వక్రీకరించింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలోని హమాస్ కీలక నేతలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో దాదాపు 80 మంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment