
విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లించేందుకు శనివారం తుది గడువు కావడంతో అర్ధరాత్రి వరకూ ట్యాక్స్ కట్టే సౌకర్యం కల్పిస్తున్నామని డీసీఆర్ సోమన్నారాయణ తెలిపారు. ఇందుకోసం అన్ని జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలతోపాటు మీ సేవా కేంద్రాలు అర్ధరాత్రి వరకూ పనిచేసే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండానే ఇంటి పన్ను, నీటిఛార్జీలు, వీఎల్‌టీ చెల్లించుకోవచ్చన్నారు. నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు, అపరాధ రుసుం విధిస్తామనీ, అలాంటి చర్యలకు ఉపక్రమించకముందే పన్ను చెల్లింపులు చెయ్యాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి 2 శాతం వడ్డీతో పన్నులు చెల్లించాల్సి వస్తుందనీ, ఈ అదనపు భారం లేకుండానే నగర ప్రజలు ట్యాక్స్‌లు కట్టాలని సోమన్నారాయణ విజ్ఞప్తి చేశారు.