
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపులను చేసే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తేనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సోమవారం చెప్పారు.
ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్‌తో పాటు కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులను చేయడానికి వీలుంది. ఈ పరిధిని విస్తరించడం, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించడం వంటి పలు సౌకర్యాలపై కసరత్తు చేస్తున్నట్లు మరో అధికారి మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment