Ajay Bhushan Pandey
-
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
రూ. లక్ష కోట్ల ‘పన్ను’ పరిష్కారం
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పన్ను వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి మంచి స్పందన లభించింది. ఆదాయపన్ను శాఖతో పన్ను వివాదాలు నెలకొన్న 5 లక్షల యూనిట్లలో సుమారు లక్ష యూనిట్లు (సంస్థలు/పరిశ్రమలు) వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఎంపిక చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే తెలిపారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఆదాయపన్ను శాఖతో నెలకొన్న వివాదాల పరిష్కారానికి వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2020–21 బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పలు అప్పిలేట్ వేదికల వద్ద 4.8 లక్షల అప్పీళ్లు పరిష్కారాల కోసం వేచి చూస్తుండగా.. వీటికి సంబంధించి రూ.9.32 లక్షల కోట్లు బ్లాక్ అయి ఉన్నాయి. ఇలా అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో 96,000 (రూ.83,000 కోట్లు) ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్నాయి. డిసెంబర్‌తోనే ఈ పథకానికి గడువు ముగిసిపోనుండగా.. కేంద్రం జనవరి 31 వరకు పొడిగించింది. ఈ పథకాన్ని ఎంచుకున్న సంస్థలు అవసరమైన మేర పన్ను చెల్లించినట్టయితే ఆ వివాదానికి అంతటితో ఆదాయపన్ను శాఖ ముగింపు పలుకుతుంది. అంతేకాదు న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టదు. రూ.లక్ష కోట్లకు పైగా పన్ను డిమాండ్లను తప్పుడు ఎంట్రీ (చేర్చడం) కారణంగా వచ్చినవని గుర్తించి పరిష్కరించినట్టు పాండా చెప్పారు. కఠిన చర్యల వల్లే జీఎస్టీ ఆదాయంలో వృద్ధి డేటా విశ్లేషణ, ఏజెన్సీల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా జీఎస్టీ ఎగవేతలను అడ్డుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్టు పాండే చెప్పారు. ఇందులో భాగంగా 7,000కు పైగా సంస్థలపై చర్యలు మొదలయ్యాయని, 187 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ చర్యల ఫలితమే ఆదాయం పెరుగు దలన్నారు. 2020 డిసెంబర్లో జీఎస్టీ ఆదాయం రూ.1.15 లక్షల కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో నమోదైన అత్యధిక ఆదాయం ఇదే కావడం గమనార్హం. నకిలీ బిల్లుల రాకెట్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం వల్ల 187 మంది అరెస్ట్ అయ్యారని, వీరిలో ఐదుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నట్టు పాండే తెలిపారు. కొంత మంది ఎండీలు కూడా 40–50 రోజుల నుంచి జైలులోనే ఉండిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్‌లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో గ్రాస్ జీఎస్టీ ఆదాయం రూ.5.59 లక్షల కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20 క్షీణత నమోదైందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31 నాటికి 80 లక్షల జీఎస్టీఆర్–3బీ రిటర్న్‌లు ఫైల్ అయ్యాయని ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్వాయిస్ జనరేట్ అవుతున్నాయి. -
ఆధార్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే పాన్ కార్డ్!
న్యూఢిల్లీ: పాన్ కార్డ్ పొందడం అత్యంత సులభతరం కానుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా సత్వరమే పాన్ కార్డును అందుకోవచ్చని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయగానే నమోదిత మొబైల్‌కు వన్ టైం పాస్ వార్డ్ (ఓటీసీ) వస్తుందని, దీనిని ఎంట్రీ చేసి వెంటనే ఈ–పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ నెలాఖరు నాటికే నూతన సేవలను అందించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
పన్ను ఎగవేతదారులను పట్టుకోండి: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు. -
మొబైల్ వాలెట్లతో పన్ను చెల్లింపులు..!
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపులను చేసే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తేనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సోమవారం చెప్పారు. ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్‌తో పాటు కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులను చేయడానికి వీలుంది. ఈ పరిధిని విస్తరించడం, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించడం వంటి పలు సౌకర్యాలపై కసరత్తు చేస్తున్నట్లు మరో అధికారి మీడియాకు చెప్పారు. -
3 నెలల్లోనే ఎన్నారైలకూ ఆధార్
న్యూఢిల్లీ: మూడు నెలల్లో భారతీయ పాస్‌పోర్టు కలిగిన ఎన్నారైలకూ ఆధార్ కార్డులు జారీ చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఆరునెలల కాలం వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలకు ఆధార్ కార్డులు జారీ చేస్తామని సంస్థ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా సాంకేతిక మార్పులు ఇప్పటికే చేపట్టామని.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఆధార్ కోర్డు జారీ కోసం టైమ్‌స్లాట్‌లు బుక్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. కాగా ఎన్నారైలకు ఆధార్ కార్డు జారీపై ఐటీ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా... యూఐడీఏఐ దేశంలో మరిన్ని ఆధార్‌సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆధార్ నమోదు, జారీ, మార్పులు చేర్పుల వంటి అన్ని సౌకర్యాలకూ ఈ సేవా కేంద్రాలు కేంద్రంగా మారనున్నాయి. ప్రస్తుతం ఈ పనులన్నీ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఆధార్ నెంబర్ తప్పుగా సమర్పిస్తే భారీ ఫైన్!
న్యూఢిల్లీ : పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ నంబరును ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తే భారీ జరిమానా తప్పదు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా పాన్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని, దాని స్థానంలో ఆధార్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ నెంబర్‌ను సమర్పించే సమయంలో తప్పుడు అంకెలు నమోదు చేస్తే రూ.10వేల జరిమానా నిబంధనను వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. అందుకనుగుణంగా సంబంధిత చట్టాల్లో సవరణలు చేసి సెప్టెంబర్ 1 నుంచి జరిమానా నిబంధనను తీసుకురావాలనుకుంటోంది. ఇప్పటికే ఐటీ చట్టంలోని సెక్షన్ 272బి సవరించాలని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి పాన్ కార్డుల స్థానంలో ఆధార్ కార్డులను కూడా ఉపయోగించవచ్చని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుంచి జనాభా డేటాను పొందిన తరువాత ఆదాయపు పన్ను విభాగం వ్యక్తికి ఆధార్ నెంబర్ ఆధారంగా పాన్ కేటాయించాలి. ఇప్పటికే తన ఆధార్‌ను తన పాన్‌తో అనుసంధానించిన వ్యక్తి కూడా తన ఎంపిక ప్రకారం పాన్ కార్డుల స్థానంలో ఆధార్‌ను చట్ట ప్రకారం ఉపయోగించవచ్చని’ బడ్జెట్లో ప్రతిపాదించారు. పాన్ నెంబర్ కోట్ చేయడం తప్పనిసరి అయిన అన్ని ప్రదేశాల్లో ఆధార్ అంగీకరించడానికి బ్యాంకులు, ఇతర సంస్థలు అందుకు తగినట్లుగా మార్పులు చేయనున్నాయి. రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మనదేశంలో 22 కోట్ల పాన్‌కార్డులు, ఆధార్‌తో అనుసంధానించి ఉన్నాయి. 120కోట్ల మందికి పైగా ప్రజలు మన దేశంలో ఆధార్‌కార్డులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆధార్ ఉంటే పాన్ తప్పనిసరి కాదు. కాబట్టి ఇది ప్రజలకు గొప్ప సౌలభ్యం. ఇక నుంచి బ్యాంకుల్లో కూడా రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన నగదును డిపాజిట్ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఆధార్‌ను ఉపయోగించి నగదు బదిలీలు చేసుకోవచ్చు.’ అని పాండే తెలిపారు. -
పాఠశాలల్లో ప్రవేశాలకు ఆధార్ అక్కర్లేదు!
న్యూఢిల్లీ: పాఠశాలలో అడ్మిషన్ పొందాలంటే విద్యార్థులు ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదని, స్కూల్ యాజమాన్యాలు సైతం విద్యార్థులను అడగవద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)సూచించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1500 పాఠశాలల్లో ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నర్సరీ లేదా ప్రాథమిక విద్యకు సంబంధించిన అడ్మిషన్లను వివిధ పాఠశాలలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల కోసం వచ్చిన చిన్నారుల ఆధార్ కార్డును సమర్పించాలంటూ వారి తల్లిదండ్రులను కోరడంతో ఈ విషయం కాస్తా యూఐడీఏఐ దృష్టి వెళ్లింది. తిరస్కరించరాదు.. పాఠశాల అడ్మిషన్లతోసహా చిన్నారులకు కల్పించే ప్రతి సౌకర్యానికి ఆధార్ సమర్పించాలని కోరడం సరికాదని, అది చట్టవిరుద్ధమైన చర్య అని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఆధార్ సమర్పించలేదని ఏ పాఠశాల యాజమాన్యం కూడా అడ్మిషన్‌ను తిరస్కరించరాదని హెచ్చరించారు. కోర్టు ధిక్కారమే.. పాఠశాలలో చేరే సమయంలో ఆధార్ లేకపోయినా విద్యార్థులను చేర్చుకోవాలని భూషణ్ సూచించారు. ఆ తర్వాత అవసరమైతే ప్రత్యేక క్యాంపులను నిర్వహించడం ద్వారా ఆధార్‌ను తీసుకోవచ్చని, అంతేకానీ, ఆధార్ సమర్పిస్తేనే అడ్మిషన్ ఇస్తామనడం మాత్రం శిక్షార్హమైనదన్నారు. ఒక వేళ అలా బలవంతంగా ఆధార్ కోరితే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించారు. బ్యాంకు ఖాతాలకు, కొత్త మొబైల్ కనెక్షన్లకు, పాఠశాల అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
ఆధార్ ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయాలేంటి?
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ మార్గాలను తెలపాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రైవేట్ టెలికం కంపెనీలను కోరింది. టెలికం వినియోగదారుల ధ్రువీకరణలో 12 అంకెల ఆధార్‌ను వాడటం నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తదితర ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్(టీఎస్పీ)కు యూఐడీఏఐ ఇటీవల ఒక సర్క్యులర్ పంపింది. ‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు తక్షణమే టీఎస్పీలు చర్యలు చేపట్టాలి. ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను ఈ నెల 15వ తేదీలోగా మాకు పంపండి’ అని అందులో యూఐడీఏఐ కోరింది. యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే దీనిపై వివరణ ఇస్తూ..‘ఆధార్ నిబంధనల ప్రకారం ఈ–కేవైసీ విధానం నుంచి సజావుగా బయటకు వచ్చేందుకు మరికొన్ని చర్యలు అవసరమవుతాయి. ఈ విషయంలో టెలికం కంపెనీలకు అవగాహన ఉంటుంది కాబట్టే 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను పంపాలని కోరాం’ అని తెలిపారు. -
ఆధార్ గోప్యతను కాపాడండి
న్యూఢిల్లీ: దమ్ముంటే తన ఆధార్‌ను దుర్వినియోగం చేయాలంటూ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ గతంలో ఆధార్ నంబర్‌ను బయటకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు హ్యాకర్లు శర్మకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు. దీంతో ఆధార్ సమాచార గోప్యతపై పౌరులకు సూచనలు చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నిర్ణయించింది. ఇందులోభాగంగా పాన్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డు తరహాలో కాకుండా ఆధార్ నంబర్ గోప్యతను కాపాడుకోవాలని యూఐడీఏఐ చెప్పనుంది. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో 12 అంకెల ఆధార్ నంబర్‌ను పంచుకోవడంపై హెచ్చరించనున్నట్లు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా ఆధార్ కార్డును వాడుకునేందుకు వీలుగా అనుమానాలను తీర్చడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ విషయంలో ప్రజలకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు, వాటి సమాధానాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. బయోమెట్రిక్స్, వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వంటి రక్షణ వ్యవస్థలు ఉన్న ఆధార్‌లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ట్రాయ్ చైర్మన్ శర్మ ఉదంతం నేపథ్యంలో 12 అంకెలున్న ఆధార్ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని యూఐడీఏఐ ప్రజలను హెచ్చరించింది. -
ఆధార్ నమోదుకు... 18,000 కేంద్రాలు ఏర్పాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 18,000 చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధార్ నమోదుతోపాటు బయోమెట్రిక్ ఐడీ అప్డేషన్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలియజేశారు. కనీసం పది శాఖలకు ఒకటి చొప్పున ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది జూలైలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను యూఐడీఏఐ కోరింది. ‘‘బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18,000 చోట్ల ఈ సదుపాయం కల్పించారు. మిగిలిన చోట్ల కూడా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి’’ అని పాండే తెలిపారు. మొత్తం మీద 26,000 కేంద్రాలు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఖాతాలకు ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతోనే బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ కోరడం గమనార్హం. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 13,800 శాఖల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10,000 శాఖల్లో ఇవి ఏర్పాటు చేయడం పూర్తయింది. ఇక 13,000 పోస్టాఫీసులకు గాను 8,000 శాఖల్లో వీటిని ఏర్పాటు చేశారు’’ అని పాండే వివరించారు. లక్ష్యం మేరకు మిగిలినవి ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ విషయంలో కష్టించి పనిచేస్తున్నట్టు చెప్పారు. -
పథకాలకు ఆధార్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి చివరి తేదీని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. సంచిత నిధి నుంచి నిధులు అందే ప్రజా పంపిణీ వ్యవస్థ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పెన్షన్లు, ఉపకార వేతనాలు, గ్యాస్, ఎరువుల సబ్సిడీలు తదితర పథకాలకు ఇది వర్తిస్తుంది. తొలుత నిర్ణయించిన దాని ప్రకారం ఆ గడువు ఈ నెల 31న ముగియాల్సి ఉంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఈ మేరకు గడువును పొడిగిస్తూ ప్రకటన జారీచేసింది. మూడు నెలల గడువు ఇచ్చినా, సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే మాత్రం మార్చి 31 తరువాత ప్రజలు ఆధార్ సంఖ్య లేదా ఆధార్‌కు నమోదు చేసుకున్నట్లు చూపే ఎన్రోల్మెంట్ రశీదును సమర్పించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆధార్ లేని కారణంగా నిజమైన లబ్ధిదారులెవరూ నష్టపోకూడదనే తాజాగా గడువు పెంచినట్లు పేర్కొన్నాయి. బ్యాంకు ఖాతాలు–ఆధార్ అనుసంధానాన్ని బ్యాంకులు కొనసాగించొచ్చని, ఆధార్ లేనంత మాత్రాన బ్యాంకు ఖాతాలను రద్దుచేయొద్దని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ సూచించారు. -
ఆధార్ వ్యవస్థ పటిష్టం!
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎంత మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారో తమ వద్ద అధికారిక సమాచారం లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ వల్ల పౌరులకు పటిష్టమైన, జీవితాంతం ఆన్లైన్లో ధ్రువీకరించుకోగల గుర్తింపుకార్డు లభించిందని ఉద్ఘాటించింది. ఆధార్ నమోదుకు వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, కంటి పాపకు సంబంధించిన వివరాలు మినహా కులం, మతం, భాష లాంటి సమాచారం కోరడం లేదంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే ఆధార్ నిర్వహణ, అమలు తీరుతెన్నులను వివరిస్తూ గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమాచార భద్రత, ఆధార్ సాకుతో ప్రజలకు ప్రభుత్వ పథకాల నిరాకరణ వంటి అంశాలపై బెంచ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.ఆధార్‌తో జరిపే లావాదేవీలపై యూఐడీఏఐ నిఘా పెట్టదని పేర్కొన్నారు. ప్రామాణిక ఎన్క్రిప్షన్ రేటు 256 కాగా, ఆధార్ వ్యవస్థ నిర్వహణకు 2048 బిట్ల ఎన్క్రిప్షన్ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా ముగిసిన ఈ ప్రజెంటేషన్ ఈనెల 27న కొనసాగుతుంది. -
ఆధార్ ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయాలంటే..
న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదోపవాదోల నేపథ్యంలో యూఐడీఏఐ, కోర్టు ముందు ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజెంటేషన్‌లో ఆధార్ సిస్టమ్‌లో భద్రతా చర్యలపై యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే ఐదుగురు సభ్యుల బెంచ్‌కు వివరించారు. అదేవిధంగా పిటిషనర్లు క్లయిమ్స్ కూడా బెంచ్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆధార్ డేటా చాలా సురక్షితమని, 2048 బిట్ ఎన్క్రిప్షన్ సిస్టమ్‌తో ఇది చాలా భద్రంగా ఉంటుందని పాండే తెలిపారు. ఫైనాన్సియల్ సిస్టమ్స్‌లో వాడే సాధారణ ఎన్క్రిప్షన్ కంటే ఇది ఎనిమిది రెట్లు బలమైనదని తెలిపారు. అంతేకాక ఈ ఎన్క్రిప్షన్ను విచ్ఛిన్నం చేయాలంటే విశ్వమంత బలం అవసరమని చెప్పారు. అనుమతి లేకుండా అసలు ఆధార్ డేటా షేర్ చేయమని, అసాధారణ పరిస్థితుల్లో జిల్లా జడ్జి అనుమతి లేకుండా కూడా షేర్ చేయలేమన్నారు. 2009 ముందు వరకు సిటిజన్లకు ఎలాంటి గుర్తింపు డాక్యుమెంట్ లేదని, తాను కూడా ఎలాంటి ఐడీ లేకుండా చిన్న ఊరి నుంచి వచ్చిన వాడేనని పాండే తెలిపారు. అయితే 49వేల మంది ఎన్రోల్మెంట్ ఆపరేటర్ల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేశారని, వారు అవినీతికి పాల్పడటం లేదు, ఇంకా అక్కడ తక్కువ డెమొగ్రాఫిక్ డేటా కూడా లేదు? అని జస్టిస్ సిక్రి ప్రశ్నించగా.. యూఐడిఏఐకి చాలా కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు ఉన్నాయని పాండే పునరుద్ఘాటించారు. బయోమెట్రిక్స్ వివరాలు సరితూగకపోతే, సర్వీసులు అందించడం నిరాకరిస్తున్న వాటిపై కూడా బెంచ్ సభ్యుల నుంచి పాండేకి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే బయోమెట్రిక్ వివరాలు ఫెయిల్ అయితే, ప్రయోజాలు అందించడం నిరాకరించకూడదని కఠిన ఆదేశాలను అథారిటీ జారీచేసినట్టు పాండే తెలిపారు. వీటి కోసం వన్‌టైమ్ పాస్వర్డ్, డెమొగ్రాఫిక్ అథెంటికేషన్ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. కేవలం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వద్ద మాత్రమే కాక, జైళ్ల వద్ద కూడా ఎన్రోల్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రతి రోజూ 4 కోట్ల అథెంటికేషన్లను చేపడుతున్నామని తెలిపారు. -
వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు సేకరించారు?
న్యూఢిల్లీ: పౌరుల్ని గుర్తించడానికి ఆధార్ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌ల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. సింగపూర్‌లో ప్రతి పౌరుడు చిప్ ఆధారిత గుర్తింపు కార్డును కలిగిఉంటాడనీ, ఈ పద్ధతిలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించదని సుప్రీం వ్యాఖ్యానించింది. దీంతో ఆధార్‌పై నెలకొన్న భయాందోళనల్ని తొలగించడానికి వీలుగా న్యాయస్థానంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈవో అజయ్ భూషణ్ పాండేను అనుమతించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. గోప్యత హక్కు కంటే పేదప్రజలు గౌరవంగా బతకడమే ముఖ్యమన్నారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనం స్పందిస్తూ.. పేదవారు కూడా గోప్యత హక్కును కలిగిఉంటారనీ, వాటిని ప్రభుత్వం ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. -
బ్యాంకుల్లో ఆధార్ సెంటర్ తప్పనిసరి
నిర్దిష్ట సంఖ్యలో ఏర్పాటు చేయకుంటే రూ.20వేల జరిమానా న్యూఢిల్లీ: నిర్దిష్ట శాఖల్లో గడువులోగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయకపోతే... బ్యాంకులు ఒక్కో బ్రాంచీకి రూ.20,000 చొప్పున జరిమానా చెల్లించాల్సి వస్తుందని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే హెచ్చరించారు. ఆదేశాల అమలు కోసం బ్యాంకులకు సెప్టెంబర్ 30 దాకా గడువు పొడిగించినట్లు తెలియజేశారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆగస్టు ఆఖరునాటికల్లా ప్రతి పది శాఖల్లో ఒక బ్రాంచీలోనైనా ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేషన్ సెంటరును ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ జూలైలో ఆదేశించింది. అయితే, బ్యాంకులు తమకు మరింత సమయం కావాలని కోరడంతో తాజాగా గడువు పొడిగించింది. ‘ఆధార్ సెంటర్ల ఏర్పాటుకు మరికాస్త సమయం కావాలంటూ బ్యాంకులు కోరాయి. దీంతో సెప్టెంబర్ 30 దాకా గడువిచ్చాం. డెడ్‌లైన్ దాటితే సదుపాయం అందుబాటులోకి రాని ప్రతి బ్రాంచీపై ప్రతి నెలా రూ. 20,000 మేర బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది‘ అని పాండే వివరించారు. అంటే, 100 శాఖలు ఉన్న బ్యాంకు 10 శాఖల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, సెప్టెంబర్ 30లోగా ఉదాహరణకు అయిదు శాఖల్లో సెంటర్ అందుబాటులోకి రాని పక్షంలో ఆ అయిదింటిపైనా తొలి నెలలోనే రూ. 1 లక్ష మేర పెనాల్టీ కట్టాల్సి వస్తుంది (ప్రతి శాఖకు రూ. 20,000 చొప్పున). ఒకవేళ తదుపరి నెలల్లో కూడా మిగిలిన శాఖల్లో సెంటర్ ఏర్పాటు చేయని పక్షంలో ఒక్కో సెంటరుకు ప్రతి నెలా రూ. 20వేలు చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానించాలంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కస్టమర్లకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బ్యాంకుల్లోనే ఎన్రోల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ భావించిందని పాండే చెప్పారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తామిచ్చిన వ్యవధి సరిపోగలదని తెలిపారు. బయోమెట్రిక్ డివైజ్‌లు మొదలైనవి సమకూర్చుకునే ప్రక్రియ ఇంకా జరుగుతోందని పలు బ్యాంకులు తెలిపినట్లు ఆయన చెప్పారు. -
ప్రభుత్వ ప్రాంగణాల్లోకి ఆధార్ కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల అధీనంలోని ఆధార్ నమోదు కేంద్రాలను జూలై చివరికల్లా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆదేశించింది. ఈ విషయమై యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే మీడియాతో మాట్లాడుతూ ‘ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 25,000 కేంద్రాలు ప్రభుత్వ పర్యవేక్షణలోకి వస్తాయి. దీంతో ప్రైవేటు సంస్థలు ఆధార్ నమోదు కోసం వసూలు చేస్తున్న అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయవచ్చ’ని అన్నారు. ఆధార్ కేంద్రాలను కలెక్టరేట్లు, జిల్లా పరిషత్, తాలూకా, మున్సిపల్ కార్యాలయాలు, బ్యాంకుల ప్రాంగణాలకు తరలించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు పాండే తెలిపారు. -
ఆధార్ నకిలీ వెబ్సైట్లపై కేసు
న్యూఢిల్లీ: ఆధార్ సంబంధిత సేవలు అందిస్తామని చెప్పుకుంటూ చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి ఆధార్‌నంబర్, ఎన్రోల్మెంట్ వివరాలు సేకరిస్తున్న 8 అనధికార వెబ్సైట్లపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కేసు నమోదు చేసింది. aadhaarupdate. com, aadhaarindia. com, pvcaadhaar. in, aadhaarprinters. com, geteaadhaar. com, downloadaadhaarcard. in, aadharcopy. in, duplicateaadharcard. com అనే వెబ్సైట్లు ఆధార్ సేవల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. చట్టం ప్రకారం అనధికారికంగా వెబ్సైట్లు నిర్వహిస్తున్న వారికి మూడేళ్లు జైలు, రూ. 10 లక్షల జరిమానా ఉంటుందని యూఐడీఏఐ సీఈవో అజయ్‌భూషణ్ పాండే పేర్కొన్నారు. తమ అధికారిక వెబ్సైట్ www. uidai. gov. in అని చెప్పారు. -
మోసపూరిత ‘ఆధార్’ సైట్లపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ: అనధికారికంగా, చట్టవిరుద్ధం గా ఆధార్ సేవలు అందిస్తూ, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న 50 ఏజె న్సీలపై యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఉక్కుపా దం మోపింది. 12 వెబ్సైట్లను గూగుల్ ప్లేస్టోర్‌లోని 12 మొబైల్ యాప్స్‌ను మూసేయించింది. మరో 26 వెబ్సైట్లు, మొబైల్ యాప్స్‌లను మూసేయాలంది. ఆధార్ సేవల కోసం ప్రజలు తమ అధికారి వెబ్సైట్ www. uidai. gov. ను, కామన్ సర్వీస్ సెంటర్లను లేదా ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషన్ పాండే పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. వెబ్సైట్లు, యాప్స్ అనధికారికంగా ఆధార్ లోగోను వాడినా చర్యలు తీసుకుంటామన్నారు. -
'విద్యార్థులకు స్పీడ్ గా ఆధార్ కార్డులు'
న్యూఢిల్లీ: విద్యార్థులు ఉపకార వేతనం అందుకోవటంలో ఇబ్బందుల్లేకుండా త్వరితగతిన ఆధార్‌కార్డు మంజూరు చేయడానికి యూఐడీఏఐ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆగస్టు 15 లోపు ఆధార్‌కు నమోదు చేసుకునే విద్యార్థులకు తొందరగా కార్డులిస్తామని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. విద్యార్థులకు ఆధార్ కార్డులు ఇప్పించే బాధ్యత పాఠశాలలదేనని, దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రాలకు పిల్లలను తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఆధార్ కార్డు కలిగిన విద్యార్థులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఎటువంటి ఆటంకాలూ లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పొందొచ్చు. ఇప్పటిదాకా దేశంలో 103.5 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు. దేశ జనాభాలోని పెద్దలలో 97 శాతం మందికి ఆధార్ కార్డులుండగా, 5-18 ఏళ్లలోపు పిల్లల్లో మాత్రం 64 శాతం మందికే ఆధార్ కార్డులున్నాయి. -
ఇక ఇతర దేశాల్లోనూ 'ఆధార్'
వాషింగ్టన్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు అడ్డుకట్టవేయడమేకాక భారత పౌరులకు విశిష్ట గుర్తింపును కల్పించిన ఆధార్ కార్డు విధానాన్ని ఇతర దేశాల్లోనూ అమలుచేయాలని ఐఎంఎఫ్ (ప్రపంచ బ్యాంక్) భావిస్తోంది. ఈ మేరకు భారత్ లో ఆధార్ కార్జుల జారీలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను ప్రత్యేకంగా పిలిపించుకుని ప్రెజెంటేషన్లు వింటోంది. ఈ క్రమంలోనే యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐఏఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే గురువారం ప్రపంచం బ్యాంక్ అధికారులకు ఆధార్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో పౌరుడికి జారీ చేసేందుకు కనీసం ఒక అమెరికన్ డాలర్ ఖర్చు కూడా కాని ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు ఏవిధమైన ప్రయోజనాలు ఉంటాయో అజయ్ భూషణ్ ప్రపంచం బ్యాంక్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా భారత్ లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రపంచ బ్యాంక్ అధికారులు ప్రశంసించారు. 100 కోట్ల మంది వేలి ముద్రలు, ఐరిస్, చిరునామాలు సేకరించడం, అంతమందికీ విశిష్ట సంఖ్యను అందివ్వడానికి భారత ప్రభుత్వం అనేక శ్రమలకోర్చిందని, అయితే ఆధార్ జారీ అయిన తర్వాత పనుల్లో పారదర్శకత, నగదు రహిత లావాదేవీలు వంటి ప్రయోజనాలు అనుభవంలోకి వచ్చాయని యైఐఏఐ డీజే తెలియజెప్పారు. సమావేశం అనంతరం అయయ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ మొదట ఆఫ్రికన్ దేశాల్లో ఆధార్ కార్డు తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆ తర్వాత మిగతా దేశాలకు విస్తరింపజేయాలని ప్రపంచ బ్యాంక్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు.