న్యూఢిల్లీ: అనధికారికంగా, చట్టవిరుద్ధం గా ఆధార్ సేవలు అందిస్తూ, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న 50 ఏజె న్సీలపై యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఉక్కుపా దం మోపింది. 12 వెబ్‌సైట్లను గూగుల్ ప్లేస్టోర్‌లోని 12 మొబైల్ యాప్స్‌ను మూసేయించింది. మరో 26 వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్‌లను మూసేయాలంది.
ఆధార్ సేవల కోసం ప్రజలు తమ అధికారి వెబ్‌సైట్ www. uidai. gov. ను, కామన్ సర్వీస్ సెంటర్లను లేదా ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషన్ పాండే పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. వెబ్‌సైట్లు, యాప్స్ అనధికారికంగా ఆధార్ లోగోను వాడినా చర్యలు తీసుకుంటామన్నారు.