
న్యూఢిల్లీ: పాన్ కార్డ్ పొందడం అత్యంత సులభతరం కానుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా సత్వరమే పాన్ కార్డును అందుకోవచ్చని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయగానే నమోదిత మొబైల్‌కు వన్ టైం పాస్ వార్డ్ (ఓటీసీ) వస్తుందని, దీనిని ఎంట్రీ చేసి వెంటనే ఈ–పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ నెలాఖరు నాటికే నూతన సేవలను అందించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.