న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్‌టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్‌టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు.
Comments
Please login to add a commentAdd a comment