Tax evaders
-
బంపర్ ఆఫర్.. పట్టిస్తే పది లక్షలు మీవే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పన్ను వసూళ్లలో పురోగతి కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పన్ను ఎగవేతదారులను పట్టిస్తే రూ. 10 లక్షల వరకు బహుమానం ఇస్తామని ప్రకటించింది. అధికారులకు కనీసం సమాచారం ఇచ్చినా తగిన బహుమతి అందుకోవచ్చని వెల్లడించింది. ఇందుకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ కార్యదర్శి జ్యోతి నిర్మలస్వామి ఓ జీఓను ఇటీవల విడుదల చేశారు. ప్రోత్సాహకాలకు ప్రత్యేక నిధి పన్నులు ఎగవేసేవారి గురించి సమాచారం ఇచ్చేవారికి బహుమానం, ఇతర ఖర్చుల కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి వాణిజ్యపన్నుల శాఖకు రూ.1.65 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి మూర్తి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. ఇందులో చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.. పన్ను ఎగవేసిన వారి గురించి అందిన సమాచారం ఆధారంగా రూ.లక్షకు పైగా వసూలైతే ఆ మొత్తం నుంచి 10 శాతం బహుమతిగా ఇస్తారు. పన్ను చెల్లింపులో చోటుచేసుకున్న జాప్యాన్ని బట్టీ సదరు మొత్తంలో 5 శాతం లేదా రూ.10 వేలు బహుమానంగా ఇస్తారు. రూ.4 లక్షలకు పైగా పన్ను బకాయి పడిన వారి సమాచారం ఇచ్చే వ్యక్తి లేదా బృందానికి ప్రభుత్వ అంగీకారంపై 10 శాతాన్ని బహుమతి పొందుతారు. ప్రభుత్వ సిబ్బందే సమాచారం ఇచ్చినట్లయితే రూ.లక్ష అనే పరిమితి లేకుండా బహుమానం ఉంటుంది. సమాచారం ఇచ్చిన అ«ధికారి ఇలా రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బహుమతి పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం చెన్నై జోన్– 1, జోన్– 2, తిరుచ్చిరాపల్లి, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూరు, సేలం, వేలూరు తదితర జిల్లాల్లోని వాణిజ్యపన్నులశాఖకు అవసరమైన నిధులు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. సమాచారం ఇచ్చే సిబ్బందికి రూ.62 లక్షలు, అధికారులైతే రూ.1.04 కోట్లు నుంచి రూ.1.66 కోట్ల వరకు నిధులు బహుమానం నిమిత్తం కేటాయించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని 2022–23 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నులశాఖకు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు -
ఎంతో మందిని చదివించాడు కానీ పన్నులు ఎగ్గొట్టాడు
వాషింగ్టన్: రాబర్ట్ స్మిత్ ఈ పేరు చాలా మందికి తెలిసే వుంటుంది. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ విస్తా ఈక్విటీ పార్ట్నర్ను స్థాపించి ఆ బిజినెస్‌లో ఉన్నత స్థానానికి ఎదిగారు. అంతే కాకుండా ఆయన గొప్ప మానవతావాది. గతేడాది మోర్ హౌస్ కాలేజీలో ఉన్న గ్రాడ్యూయేట్ విద్యార్థుల అందరి ఫీజులు చెల్లించి తన మంచితనాన్ని చాటుకున్నారు. ఇదిలావుండగా స్మిత్ 15ఏళ్లుగా వేలకోట్ల రూపాయల పన్ను ఎగ్గొటారని శాన్ఫ్రాన్సిస్కో ఆటర్నీ డేవిడ్ ఆండర్సన్ తెలిపారు. అమెరికాలోనే అత్యంత ట్యాక్స్ కుంభకోణం రెండు బిలియన్ డాలర్ల కేసులో నేరస్తుడిగా ఉన్న రాబర్ట్ బ్రోక్మన్ కేసు విచారణలో స్మిత్‌ను విచారించారు. అందుకు సహకరించడానికి స్మిత్ ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే స్మిత్ 15 ఏళ్లుగా వివిధ రకాల ట్రస్ట్‌లు, కార్పొరేషన్ల ద్వారా ఫారెన్ ఫండ్లను తప్పుదారి పట్టించి వాటి ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు డేవిడ్ ఆండర్సన్ తెలిపారు. ఇక వీటికి సంబంధించి 139 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు మరిన్ని విషయాలను సేకరిస్తున్నారు. చదవండి: ప్రధానివా.. మోడల్‌వా? -
పన్ను ఎగవేతదారులను పట్టుకోండి: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు. -
ఇక పన్ను ఎగవేతదారులకు చుక్కలే!
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపేందుకు జీఎస్టీ రిటన్స్ డేటాను వినియోగించుకోవాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. పన్ను ఎగవేతదారులపై ముప్పేట దాడికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలతో 2018 మే నాటికి పన్ను ఎగవేత దాదాపు అసాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీలు, వాటి ప్రమోటర్ల ఆదాయాన్ని వారు దాఖలు చేసిన జీఎస్టీ రిటన్స్‌తో సరిపోల్చి ఓ డేటాబేస్‌ను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరోక్ష పన్నుల డేటాను ఆదాయ పన్ను రిటన్స్‌తో ప్రభుత్వం సరిపోల్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత పన్ను వ్యవస్థతో పోలిస్తే జీఎస్టీ ద్వారా వ్యాపారాల పరిమాణం, లావాదేవీలపై స్పష్టత అధికంగా ఉండటంతో ఆదాయం తక్కువగా చూపడం లేదా ఖర్చులు పెంచి చూపడం వంటి అవకతవకలకు పెద్దగా ఆస్కారం ఉండదని భావిస్తున్నారు. ప్రజలు పెడుతున్న ఖర్చు, రాబడి, పెట్టుబడులపై డేటా ఎనలిటిక్స్ ద్వారా పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని పన్ను ఎగవేతదారులకు దీంతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద పోగుపడిన డిపాజిట్ల డేటా సైతం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండటంతో పన్ను అక్రమాలను పరిశీలించేందుకు డేటా అనలిటిక్స్‌ను విరివిగా ఉపయోగించాలని భావిస్తున్నారు. -
పన్ను ఎగవేతదారులకు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: మీరు ఎంతో ముచ్చట పడి కొనుక్కున్న లగ్జరీ కార్లు, పూర్తిగా మీ సొంతమైన విలాసవంతమైన ఇల్లు, లేదా హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలు.. ఎక్రెట్రా.. ఎక్సెట్రా... ఇలాంటి లావిష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా. అయితే.. ఇకముందు ఇలా చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.. ఎందుకంటే ఇకపై ఇలాంటి ఫోటోల ద్వారా పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మరో కీలక చర్యను చేపట్టనుంది. బ్యాంకులు, ఖాతాల పరిశీలన లాంటి సంప్రదాయపద్ధతుల్లో మాత్రమే కాకుండా, సోషల్‌మీడియా ద్వారా కూడా తప్పుడు లెక్కలతో, భారీ ఎత్తున పన్ను ఎగవేస్తున్న వారి సమాచారాన్ని సేకరించనుందట. ఇందుకు గాను ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా పోస్టులును ఆదాయ పన్ను శాఖ పరిశీలించనుంది. తాజా నివేదికల ప్రకారం ఆదాయపు ప్రకటనలతో, ఖర్చు నమూనాలతో సరిపోలాయో లేదో తేల్చుకునేందుకుగాను అధికారులు ఆయా వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులను పరిశీలించనున్నారు. ఈ నెలనుంచే ఈ ప్ర్రక్రియ మొదలుకానుందని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ ఇన్సైడ్’ పేరుతో ఈ ప్రాజెక్టు రెండు దశల్లో అమలు కానుంది. ప్రాజెక్ట్ ఇన్సైట్ ద్వారా 40శాతం పన్ను వసూలు పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టుకోసం 156 మిలియన్ డాలర్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దీని ద్వారా కార్యాలయాలు , గృహాలపై దాడి చేయకుండా చాలా తక్కువ పన్ను చెల్లించేవారిని అధికారులు గుర్తించే అవకాశం ఉందని పేరు చెప్పడానికి అంగీకరించని అధికారి మీడియాకు చెప్పారు. ప్రాజెక్టు మొదటి దశలో 30 శాతం నుండి 40 శాతం పరిశీలన ఉంటుంది. ఈ సమయంలో క్రెడిట్ కార్డు ఖర్చు, ఆస్తి మరియు స్టాక్ పెట్టుబడులు, నగదు కొనుగోళ్లు మరియు డిపాజిట్లు సహా మొత్తం డేటా - కొత్త వ్యవస్థకు మైగ్రేట్ అవుతుంది. ఆ తరువాత పోస్టల్ లేదా ఇమెయిల్ ద్వారా టాక్స్ డిక్లరేషన్లను దాఖల చేయాలని కేంద్రం బృందం సమాచారం పంపుతుంది. ఈ డేటా విశ్లేషణ , పరిశీలనతో రెండో దశ డిసెంబర్ నుంచి మొదలుకానుంది. కాగా ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు 2016-17 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ రిటర్న్‌కు గడువు జూలై 30తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు
-
పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు: మోదీ
ఇన్నాళ్లుగా దోపిడీ చేసిన సొమ్మును ఇప్పుడు తిరిగి రాబడుతున్నామని, ఇప్పటివరకు రూ. 45 వేల కోట్ల నగదు డిపాజిట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జపాన్‌లోని కోబె నగరంలో ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నవారందరికీ సెల్యూట్ అని చెప్పారు. ఇది ఎవరినో ఇబ్బందిపెట్టడానికి తీసుకున్న నిర్ణయం కాదని, ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మాత్రం సహకరిస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని చాలా రహస్యంగా ఉంచామన్నారు. పన్ను ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదని, నిజాయితీపరులను రక్షించడం మాత్రం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇన్నాళ్లూ గంగానదితో పుణ్యానికి ఒక్క రూపాయి కూడా వేయనివాళ్లు సైతం ఇప్పుడు వెయ్యి, 500 రూపాయల నోట్లు విసిరేస్తున్నారంటూ చమత్కరించారు. ఇన్నాళ్లూ బ్యాంకుల ముఖం చూడనివాళ్లు కూడా ఇప్పుడు బ్యాంకులకు వెళ్తున్నారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, గత ఏడాది అధ్యధికంగా ఎఫ్‌డీఐలు వచ్చాయని మోదీ అన్నారు. గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు కోబె నగరం ఆదుకుందని, ఈ నగరంతో భారతదేశానికి చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు ప్రశంసిస్తున్నాయని అన్నారు. జనధన యోజన కింద పేదలందరికీ అకౌంట్లు తెరిచామని, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. అవినీతిని నిర్మూలించడమే అసలైన స్వచ్ఛభారత్ అని, నియమ నిబంధనలు అందరికీ సమానమేనని చెప్పారు. -
సేవల పన్ను ఎగ్గొడితే కఠిన చర్యలు: చిదంబరం
కోల్‌కతా: దేశంలో సేవల పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్థికమంత్రి పీ.చిదంబరం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ తరహా ఎగవేతదారులను అరెస్ట్చేయడమే కాకుండా, కఠినశిక్ష విధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 55 శాతం వాటా కలిగిన సేవల నుంచి రంగం ఆశించిన స్థాయిలో పన్నుల పరిమాణం లేదని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం జరుగుతుందని చిదంబరం తెలిపారు.