ఎనిమిది అనధికార వెబ్‌సైట్లపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ఆధార్ సంబంధిత సేవలు అందిస్తామని చెప్పుకుంటూ చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి ఆధార్‌నంబర్, ఎన్‌రోల్‌మెంట్ వివరాలు సేకరిస్తున్న 8 అనధికార వెబ్‌సైట్లపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కేసు నమోదు చేసింది. aadhaarupdate. com, aadhaarindia. com, pvcaadhaar. in, aadhaarprinters. com, geteaadhaar. com, downloadaadhaarcard. in, aadharcopy. in, duplicateaadharcard. com అనే వెబ్‌సైట్లు ఆధార్ సేవల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
చట్టం ప్రకారం అనధికారికంగా వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న వారికి మూడేళ్లు జైలు, రూ. 10 లక్షల జరిమానా ఉంటుందని యూఐడీఏఐ సీఈవో అజయ్‌భూషణ్ పాండే పేర్కొన్నారు. తమ అధికారిక వెబ్‌సైట్ www. uidai. gov. in అని చెప్పారు.