Instagram Down: మెటా యాజమాన్యంలో ఉన్న 'ఇన్‌స్టాగ్రామ్' (Instagram) మళ్లీ డౌన్ అయింది. ఈ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 56 శాతం మంది వినియోగదారులు ఈ అంతరాయం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు.
డౌన్ డిటెక్టర్ నివేదికల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు లాగిన్ అవ్వడం, ఫోటో అండ్ వీడియో షేరింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ డౌన్‌లోడ్ చేయడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఎంత మంది ఎదుర్కొన్నారు అనేదాని మీద ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇది సుమారు 2 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ని యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నామని ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు.
me thinking my account is hacked cause instagram down AGAIN 🤦🏾♂️ pic.twitter.com/GG0y0OYm3m
— Jay-Wuan© (@__jaywuan) June 9, 2023
ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాదిలో ఇది రెండవ సారి కావడం గమనార్హం. 2023 మార్చి నెలలో కూడా ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు కూడా వేలాదిమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఏర్పడిన అంతరాయానికి గల కారణాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది.
Here we go again #instagramdown pic.twitter.com/EDT9FKtJXZ
— z (they/them) (@ryzuknife) June 9, 2023
Comments
Please login to add a commentAdd a comment