ప్రేమించుకున్న వాళ్లు విడిపోతే.. కొంతమంది ఎవరి దారి వారు చూసుకుంటారు! అయితే మరికొంత మాత్రం తమ ప్రేమ విషయంలో మనస్పర్థలు తలెత్తితే అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తారు. అయితే తాజాగా ఓ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా తన మాజీ ప్రేమికుడిని వేధింపులకు గురిచేసింది.
వివరాల్లోకి వెళ్లితే.. ఐర్లాండ్‌కు చెందిన 20ఏళ్ల కర్టనీ ఎయిన్స్ వర్త్ అనే ఓ అమ్మాయి, లూయిస్ జాలీని ప్రేమించింది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే అప్పటి నుంచి తన మాజీ ప్రేమికుడి మీద పగ పెంచుకుంది కర్టనీ.
ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని భావించిన కర్టనీ.. 30 నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి.. తనకు తానే చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్‌లు పంపించుకుంది. అనంతరం వాటిని లూయిస్ పంపించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ప్రియుడిపై పగతో వేధించాలని కర్టనీనే పలు మెయిల్ ఐడీలతో 30 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించినట్లు పోలీసులు తేల్చారు.
ఆమె ఫిర్యాదు కారణంగా లూయిస్ ఉద్యోగం కూడా కోల్పోవల్సి వచ్చింది. పోలీసులు కర్టనీని అరెస్ట్ చేసి.. న్యాయస్థానంలో హాజరుపరిచారు. లూయిస్ ఏ తప్పు చేయలేదని కర్టనీ కావాలని అతన్ని వేధింపులకు గురి చేసి ఉద్యోగం కోల్పోయేలా చేసినందుకు కోర్టు ఆమెకు 10 నెలల జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment