నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు హ్యాకయ్యాయి  | Instagram Accounts of Children too Have been Hacked: Priyanka Gandhi | Sakshi
Sakshi News home page

నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు హ్యాకయ్యాయి 

Published Wed, Dec 22 2021 8:18 AM | Last Updated on Wed, Dec 22 2021 8:18 AM

Instagram Accounts of Children too Have been Hacked: Priyanka Gandhi - Sakshi

లక్నో: తన కుమార్తె, కూతురుకు చెందిన ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్లు హాకింగ్‌కు గురయ్యాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు. లక్నోలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఫోన్ల ట్యాపింగ్‌ వదిలేయండి. నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారు. ఈ ప్రభుత్వానికి ఏ పనీ లేదా?’అని వ్యాఖ్యానించారు.

సీఎం యోగి తన ఫోన్లను ట్యాప్‌ చేసి, సంభాషణల రికార్డులను ప్రతి రోజూ వింటున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘నేను బాలికను. నేను పోరాడతాను’ నినాదంతో తాను చేపట్టిన కార్యక్రమం కారణంగానే ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో మహిళలతో సభ ఏర్పాటు చేసి, పలు పథకాలు ప్రకటించాల్సి వచ్చిందని ప్రియాంక అన్నారు. 

చదవండి: (Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్‌ ‘హ్యాట్రిక్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement