స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్
సాక్షి, ముంబై : సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు తరచుగా హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీటర్ ద్వారా తెలుపుతూ.. 'ఎవరో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. ప్రస్తుతం అంతా ఒకే. మరో విషయం ఏంటంటే.. నాకు స్నాప్‌చాట్ అకౌంట్ లేదు. నాపేరుతో స్నాప్‌చాట్ ఖాతా ఎవరైనా నిర్వహిస్తున్నారంటే హ్యాకర్ అని గుర్తించాలంటూ' డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
సల్మాన్ ఖాన్ హీరోగా సినిమాలు తీసి రికార్డు వసూళ్లు రాబట్టిన దర్శకుడే ఈ అలీ అబ్బాస్ జాఫర్. 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా టైగర్ జిందా హై’ రికార్డులకెక్కింది. సల్మాన్, అలీ అబ్బాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టైగర్ జిందా హై’ , ‘సుల్తాన్’, మూవీలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ‘భరత్’ అనే సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు.
Hack alert , someone hacked my Instagram account , sorting it out also I am not on Snapchat , so if someone uses Snapchat under my name is the hacker. Have a good day .
— ali abbas zafar (@aliabbaszafar) 29 March 2018
Comments
Please login to add a commentAdd a comment