అవును.. నా అకౌంట్​ హ్యాక్​ అయింది.. ఆ హీరోయిన్ ట్వీట్​​ | Amritha Aiyer Instagram Has Been Account Hacked | Sakshi
Sakshi News home page

Amritha Aiyer: అవును.. నా అకౌంట్​ హ్యాక్​ అయింది.. ఆ హీరోయిన్ ట్వీట్​​

Published Wed, Feb 2 2022 2:10 PM | Last Updated on Wed, Feb 2 2022 2:16 PM

Amritha Aiyer Instagram Has Been Account Hacked - Sakshi

Amritha Aiyer Instagram Has Been Account Hacked: ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్​ను హ్యాక్​ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్​ చేయడమే కాకుండా ఇబ్బందికరంగా ఉండే కామెంట్స్​ కూడా పెడుతుంటారు. ఇలా హ్యాక్​ గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ హ్యాక్​కు గురైనా తారల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్​, వరలక్ష్మీ శరత్​ కుమార్​ తదితరులు ఉన్నారు. 



తాజాగా వీరి జాబితాలో మరో యంగ్​ హీరోయిన్​ చేరింది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో పాపులర్​ అయిన అమృత అయ్యర్​ ఇన్​స్టా గ్రామ్ అకౌంట్​ హ్యాక్​ అయింది. ఈ విషయాన్ని తన ట్విటర్​ ఖాతా ద్వారా తెలిపింది. తన అకౌంట్​ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు అమృత ట్వీట్ చేసింది. ప్రస్తుతానికైతే హ్యాక్​కు గురైన అమృత ఇన్​స్టా అకౌంట్​ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు రాలేదని తెలుస్తోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement