hacked accounts
-
అవును.. నా అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ హీరోయిన్ ట్వీట్
Amritha Aiyer Instagram Has Been Account Hacked: ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్ చేయడమే కాకుండా ఇబ్బందికరంగా ఉండే కామెంట్స్ కూడా పెడుతుంటారు. ఇలా హ్యాక్ గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ హ్యాక్‌కు గురైనా తారల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో మరో యంగ్ హీరోయిన్ చేరింది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో పాపులర్ అయిన అమృత అయ్యర్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. తన అకౌంట్ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు అమృత ట్వీట్ చేసింది. ప్రస్తుతానికైతే హ్యాక్‌కు గురైన అమృత ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు రాలేదని తెలుస్తోంది. Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon . — Amritha (@Actor_Amritha) February 1, 2022 -
ఏసర్ యూజర్లకు భారీ షాక్..!
ప్రముఖ తైవాన్ టెక్ దిగ్గజం ఏసర్ భారతదేశంలోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు దృవీకరించింది. 60జీబీ వినియోగదారుల డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి. యూజర్ల వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ కస్టమర్ డేటా, సున్నితమైన ఖాతాల సమాచారం, ఆర్థిక డేటాను యాక్సెస్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలోని 10,000 మంది కస్టమర్ల రికార్డులను కలిగి ఉన్న ఫైళ్లు, డేటాబేస్ కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేశారు. (చదవండి: ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!) భారతదేశం అంతటా ఏసర్ రిటైలర్లు, పంపిణీదారుల 3,000 సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని హ్యాకర్ బృందం పేర్కొంది. భారతదేశంలో తన స్థానిక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సిస్టమ్ పై దాడి చేసినట్లు ఏసర్ పేర్కొంది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏసర్ ధృవీకరించినట్లు నివేదిక తెలిపింది. ఈ విషయం గురుంచి దేశంలోని ఖాతాదారులందరిని అలర్ట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ దాడి గురుంచి స్థానిక అధికారులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఇఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు ఏసర్ పేర్కొంది. ఏడు నెలల్లో ఏసర్ పై జరిగిన రెండో సైబర్ సెక్యూరిటీ దాడి ఇది. మార్చిలో ఆర్ ఈవిల్ చేసిన రాన్సమ్ వేర్ దాడితో కంపెనీ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకులయి. దొంగిలించిన డేటాను తిరిగి పొందడం కోసం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లో ఏసర్ ను హ్యాకర్లు కోరారు. ఆ సమయంలో హ్యాకర్లు డిమాండ్ చేసిన అతిపెద్ద డిమాండ్ అది. -
నా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి
సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు అప్పుడప్పుడు హ్యాక్‌కు గురవడం చూస్తుంటాం. వారి ఖాతాల్ని హ్యాక్ చేసి అభ్యంతరకరమైన సందేశాలు, ఫొటోల్ని పోస్ట్ చేస్తుంటారు హ్యాకర్లు. తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. ఈ కారణంగా వాటిలో నేను పోస్టులు పెట్టలేకున్నాను. నా ఖాతాలను పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందాలతో సంప్రదింపులు జరుపుతున్నాను. వీటి పునరుద్ధరణకు కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు నా సోషల్ మీడియా ఖాతాలో ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల ఫాలోయర్లు జాగ్రత్తగా ఉండాలి. నా అకౌంట్లు పునరుద్ధరణ అయిన తర్వాత నేనే అభిమాలకు తెలియజేస్తాను’’ అని వరలక్ష్మి తెలిపారు. -
ఒకే ఒక్క డాలర్ కు.. హ్యాకింగ్ అకౌంట్లు అమ్మకం
ఫ్రాంక్‌పర్ట్ : హ్యాక్ చేసిన వందల మిలియన్ల యూజర్ పేర్లు, పాస్ వర్డులు, ఈ-మెయిల్ అకౌంట్లు, వెబ్ సైట్లు రష్యా క్రిమినల్ వరల్డ్ లో వాణిజ్యం జరుగుతున్నాయట. 272.3 మిలియన్ అకౌంట్లు(2723 లక్షల అకౌంట్లు) చోరీ అయ్యాయట. వాటిలో ఎక్కువగా రష్యా ప్రముఖ ఈ-మెయిల్ సర్వీసు మెయిల్.రూ అకౌంట్లే ఉన్నాయని సెక్యురిటీ నిపుణులు చెబుతున్నారు. మిగతా అకౌంట్లు గూగుల్, యాహు, మైక్రోసాప్ట్ యూజర్లకు సంబంధించినవి ఉన్నాయని హోల్డ్ సెక్యురిటీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసర్ అలెక్స్ హోల్డెన్ తెలిపారు. నిగూఢంగా భధ్రపరిచిన సమాచారాన్ని దొంగలించబడటంలో ఇదే అతి పెద్దదని, రెండేళ్ల క్రితం అమెరికాలో బ్యాంకుల, రిటైలర్లపై సైబర్ అటాక్ ఇలానే జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే రష్యాకు చెందిన ఓ యువకుడు ఈ క్రైమ్ కు పాల్పడాడని హోల్డ్ సెక్యురిటీ కనుగొన్నది. కేవలం ఒకే ఒక్క డాలర్ కు దొంగలించబడిన అకౌంట్లను అమ్మకానికి పెట్టినట్టు పేర్కొంది. వీటిలో 570 లక్షల అకౌంట్లు మెయిల్.రూ కు సంబంధించినవి ఉంటే, 400 లక్షల యాహు అకౌంట్లు, 330 లక్షల హాట్ మెయిల్ అకౌంట్లు, 240 లక్షల జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయని హోల్డ్ సెక్యురిటీ చెప్పింది. ఈ హ్యాకింగ్ డేటాసెట్ లో వేల సంఖ్యలో అమెరికా బ్యాంకింగ్, తయారీ, రిటైల్ కంపెనీల ఉద్యోగులకు సంబంధించిన యూజర్ పేరు, పాస్ వర్డులు ఉన్నాయని హోల్డ్ వెల్లడించింది.