సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో ఇటీవల వచ్చిన డిలీట్ ఫర్ ఎవ్రి వన్ ఫీచర్ అసలు పూర్తి స్థాయిలో పని చేస్తుందా?. యూజర్లు పొరపాటున పంపిన సందేశాలు రిసీవర్లు (మెసేజ్ పొందినవారు) చదివేలోగా డిలీట్ చేయవచ్చునంటూ డిలీట్ ఫర్ ఎవ్రి వన్ అంటూ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చినా ప్రయోజనం లేదని తెలుస్తోంది. తొలుత వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా సెండర్, రిసీవర్ ఇద్దరూ యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న వారై ఉండాలి. కేవలం ఒకరు మాత్రమే యాప్ అప్‌డేట్ చేసుకున్నా ప్రయోజనం ఉండదని కంపెనీ హెచ్చరించింది. కానీ మరో విధంగా మెస్సేజ్ రిసీవింగ్ నెటిజన్ సెండర్ పంపిన సందేశాలను తెలుసుకునే ఛాన్స్ ఉంది.
అదేలా అంటే.. ముందుగా ఆ యూజర్ తమ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'నోటిఫికేషన్ హిస్టరీ లాగ్' అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ మన ఫోన్లో ఉంటే వాట్సప్‌లో మనకు పంపి, డిలీట్ చేసిన సందేశాలను చదవవచ్చు. వాట్సప్‌లో పంపించే మెసేజ్‌లు నోటిఫికేషన్స్ రూపంలో అవతలి వ్యక్తి దృష్టికి తీసుకెళ్తాయి. అలా ఒక్కో మెసేజ్‌లోని తొలి 100 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ నోటిఫికేషన్ హిస్టరీ లో స్టోర్ అవుతాయి. వాట్సప్ నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేయనంత వరకు ఈ విధంగా డిలీట్ చేసిన సమాచారాన్ని చదవే అవకాశం ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 7.0, ఆ తర్వాత వచ్చిన అప్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే మీకు ఇతరులు పంపి, డిలీట్ చేసిన సందేశాలు చూసుకోవచ్చు.
డిలీట్ చేసిన మెసేజ్‌ను పై చిత్రంలో చూడవచ్చు
Comments
Please login to add a commentAdd a comment