Notification Applications
-
University of Hyderabad: పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ..యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంటున్న విశ్వవిద్యాలయం. అనేక విభాగాల్లో విద్య, పరిశోధనలు కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా.. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. హెచ్‌సీయూ అందిస్తున్న కోర్సుల వివరాలు.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ, హెల్త్ సైకాలజీ స్పెషలైజేషన్స్‌తో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ అందుబాటులో ఉంది. అలాగే ఆరేళ్ల వ్యవధితో మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రి కోర్సును సైతం ఈ యూనివర్సిటీ అందిస్తోంది. అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు అన్ని గ్రూపుల విద్యార్థులు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్: హిందీ, తెలుగు, లాంగ్వేజ్ సైన్సెస్, ఉర్దూ. సోషల్ సైన్సెస్: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు అందుబాటులో ఉంది. అర్హత: ఏదైనా గ్రూపులో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. పరీక్ష విధానం ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–మ్యాథ్స్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఎమ్మెస్సీ హెల్త్ సైకాలజీ కోర్సు ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్ స్థాయి సైకాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉండే ప్రశ్నపత్రంలో అభ్యర్థి ఎంచుకున్న లాంగ్వేజ్‌పై 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 35 ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్‌పై 25 ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సోషల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పీజీ స్థాయి కోర్సులు మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎమ్మెస్సీ) మ్యాథ్స్/అప్లయిడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలను ఆర్సీబీ ఫరీదాబాద్ నిర్వహించే గాట్–బి ద్వారా ఖరారు చేస్తారు. ఎంసీఏ: నిమ్‌సెట్–2021 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ: హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్,ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. క్యాట్ ర్యాంకు ఆధారంగా ఎంబీఏలో ప్రవేశాలను ఖరారు చేస్తారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎంఏ) ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, కమ్యూనికేషన్(మీడియా ప్రాక్టీస్) తదితరాలు. ఎంఈడీ, ఎంపీఏ(డ్యాన్స్), ఎంపీఏ(థియేటర్ ఆర్ట్స్), ఎంపీఏ మ్యూజిక్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ అండ్ స్కల్పచర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్). ఎంపిక విధానం: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్) కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బయోఇన్ఫర్మాటిక్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి గేట్ స్కోర్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్:ఎంటెక్ కంప్యూటర్ సైన్స్‌లో జేఈఈ సీఎస్ఏబీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్డీ అప్లయిడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్ స్టడీస్, కంపారిటివ్ లిటరేచర్, సంస్కృతం, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, ఫోక్ కల్చర్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ సైన్సెస్, ఫిజియాలజీ, మెటీరియల్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్డీ: బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20,2021 వెబ్సైట్: https://uohyd.ac.in -
సచివాలయ పోస్టుల పరీక్ష కేంద్రాలకు కసరత్తు
సాక్షి, కృష్ణా : వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు రికార్డు స్థాయిలో భర్తీ చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నియామక పరీక్ష సెప్టంబర్ 1న ఉండే అవకాశముండటంతో సమర్థంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నా తలంపుతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పరీక్షా కేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రాథమికంగా జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అన్ని వసతులు ఉన్న 497 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో అభ్యర్థులకు అవసరమైన గాలి, వెలుతురు, రవాణా సౌకర్యం తదితర ఆంశాలను పరీక్షిస్తున్నారు. 2 లక్షల మందికి పైగా రాసే అవకాశం.. భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం, గత పాలకుల నిర్వాకం వల్ల నిరుద్యోగులు పెరగటంతో సచివాలయ పోస్టులకు డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకుపైగా పరీక్ష రాసే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలో 933 గ్రామ, 511 వార్డు సచివాలయాలకు గాను 11,025 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన 497 కేంద్రాలతో సుమారు 1.33 లక్షల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. మరో 70 వేల మందికి పైగా పరీక్షరాయనుండటంతో వారికోసం పరీక్ష కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి తోడు మరో 200 సెంటర్లు సిద్ధం చేయటానికి జెడ్పీ సీఈఓ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు. విధులు నిర్వహించనున్న 20 వేలమంది అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా నిరుద్యోగులు పరీక్ష రాయనుండటం సుమారు 700 దాకా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటంతో అంతే స్థాయిలో అధికారులు, సిబ్బంది అవసరమవుతారు. ఇందుకోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర అధికారులను విధుల్లోకి తీసుకోనున్నారు. పరీక్షా కేంద్రంలో ప్రతిగదికి ఓ ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్, రూట్ అధికారులు పనిచేయనున్నారు. అలాగే భద్రతా పరమైన ఏర్పాట్లకు పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది అవసరమం కానున్నారు. ముఖ్య పట్టణాలతో పాటు చిన్న నగరాల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నడంతో రవాణా ఏర్పాట్లపైనా అధికారులు దృష్టిపెడుతున్నారు. -
తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల
తిరుపతి అర్బన్ : ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ పరిధిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి పోస్టల్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ కోసం గురువారం తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఆన్లైన్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్‌కు మే 12వ తేదీ వరకు అవకాశముందని వెల్లడించారు. దరఖాస్తు, పరీక్ష రుసుములను ఈ–పేమెంట్ విధానంలో మాత్రమే పోస్టాఫీసులో చెల్లించాలని కోరారు. తిరుపతి డివిజన్ పరిధిలోని అన్ని హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు తపాలా శాఖ వెబ్సైట్లను పరిశీలించాలని కోరారు. -
‘అంగన్వాడీ’ల భర్తీకి నోటిఫికేషన్
నల్లగొండ : అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తోన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జిల్లాలోని 31 మండలాల్లో 2,093 అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 205 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ ప్రకటించింది. అంగన్వాడీ కేంద్రాల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. హేతుబద్ధీకరణకు ముందు కేంద్రాల్లో ఖాళీలు 227 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 205కు తగ్గింది. జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల్లోని పోస్టులకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఈ పోస్టుల్లో అంగన్ వాడీ టీచర్లు 48, ఆయాలు 125, మినీ అంగన్వాడీ టీచర్లు 32 పోస్టులు ఉన్నాయి. పోటాపోటీ... ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రూ.10, 500, ఆయాలకు రూ.7,300 వరకు వేతనాలు పెంచింది. ఓ వైపు వేతనాలు పెరగడం, చాలా సంవత్సరాల తర్వాత ఖాళీలు భర్తీ చేస్తుండడంతో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగానే ఉండనుంది. నియామకాల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా చేసేందుకు ఆన్లైన్ విధానాన్ని ఎంపిక చేసింది. నియామకాలకు సంబంధించిన నిబంధనలు కూడా మార్పు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆర్డీఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. పాత కమిటీలో ఎమ్మెల్యేలకు స్థానం కల్పించి, ఇంటర్వూలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్వూల్లేవు. కేవలం పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు... దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్లో చేపట్టనున్నారు. wdcw.tg.nic.in వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24 నుంచి 30 వరకు దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రాజెక్టు కార్యాలయాల్లో స్క్రూట్నీ చేయించుకోవాలి. లేదంటే వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. సర్టిఫికెట్స్‌తో పాటు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, జాబ్‌కార్డు కూడా తీసుకురావాలి. దరఖాస్తు స్వీకరణ గడువు ముగిశాక అర్హులైన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో తెలియజేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ప్రొ ఫార్మాను, అర్హత సర్టిఫికెట్లను సీడీపీఓ కార్యాలయంలో సమర్పించాలి. అర్హతలు.. - అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. - జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాలు వయసు నిండి 35 ఏళ్లు మించరాదు. - అభ్యర్ధి తప్సనిసరిగా వివాహితురాలై ఉండాలి. - స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి. - ఎస్సీ, ఎస్టీ కేటాయించిన అంగన్ వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18–35 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. - ఎస్సీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి. - ఎస్టీకి కేటాయించిన అంగన్ వాడీ కేంద్రాలకు అదే ఆవాస ప్రాంతానికి చెందిన అభ్యర్థులై ఉండాలి. వికలాంగులు : - వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు అర్హులు. - అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు. - కాళ్లు, చేతులకు సంబంధించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్య నేర్పుటకు గానీ, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి. జత చేయాల్సిన పత్రాలు.. - పుట్టిన తేదీ / వయసు ధ్రువీకరణ పత్రం. - కుల ధ్రువీకరణ పత్రం - విద్యార్హత ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితా. - నివాస స్థల ధ్రువీకరణ పత్రం - అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం - వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం - అనాథ అయితే అనాథ సర్టిఫికెట్ - వికలాంగులు అయితే సంబంధించిన సర్టిఫికెట్ - దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారి అటిస్టేషన్తో ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించాలి. జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల ఖాళీల వివరాలు.. ప్రాజెక్టుపేరు అంగన్వాడీ అంగన్వాడీ మినీఅంగన్వాడీ టీచర్లు ఆయాలు టీచర్లు అనుముల 9 19 13 చింతపల్లి 3 9 0 నకిరేకల్ 2 6 0 దేవరకొండ 6 13 0 కొండమల్లేపల్లి 12 17 4 మునుగోడు 3 16 1 దామరచర్ల 5 16 12 నల్లగొండ 6 21 2 మిర్యాలగూడ 2 8 0 మొత్తం 48 125 32 -
మెసేజ్ డిలీట్ చేసినా చదవొచ్చు.. ఎలాగంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో ఇటీవల వచ్చిన డిలీట్ ఫర్ ఎవ్రి వన్ ఫీచర్ అసలు పూర్తి స్థాయిలో పని చేస్తుందా?. యూజర్లు పొరపాటున పంపిన సందేశాలు రిసీవర్లు (మెసేజ్ పొందినవారు) చదివేలోగా డిలీట్ చేయవచ్చునంటూ డిలీట్ ఫర్ ఎవ్రి వన్ అంటూ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చినా ప్రయోజనం లేదని తెలుస్తోంది. తొలుత వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా సెండర్, రిసీవర్ ఇద్దరూ యాప్‌ను అప్డేట్ చేసుకున్న వారై ఉండాలి. కేవలం ఒకరు మాత్రమే యాప్ అప్డేట్ చేసుకున్నా ప్రయోజనం ఉండదని కంపెనీ హెచ్చరించింది. కానీ మరో విధంగా మెస్సేజ్ రిసీవింగ్ నెటిజన్ సెండర్ పంపిన సందేశాలను తెలుసుకునే ఛాన్స్ ఉంది. అదేలా అంటే.. ముందుగా ఆ యూజర్ తమ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'నోటిఫికేషన్ హిస్టరీ లాగ్' అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ మన ఫోన్లో ఉంటే వాట్సప్‌లో మనకు పంపి, డిలీట్ చేసిన సందేశాలను చదవవచ్చు. వాట్సప్‌లో పంపించే మెసేజ్‌లు నోటిఫికేషన్స్ రూపంలో అవతలి వ్యక్తి దృష్టికి తీసుకెళ్తాయి. అలా ఒక్కో మెసేజ్లోని తొలి 100 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ నోటిఫికేషన్ హిస్టరీ లో స్టోర్ అవుతాయి. వాట్సప్ నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేయనంత వరకు ఈ విధంగా డిలీట్ చేసిన సమాచారాన్ని చదవే అవకాశం ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 7.0, ఆ తర్వాత వచ్చిన అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే మీకు ఇతరులు పంపి, డిలీట్ చేసిన సందేశాలు చూసుకోవచ్చు. డిలీట్ చేసిన మెసేజ్‌ను పై చిత్రంలో చూడవచ్చు -
తిరుగుటపాలో దరఖాస్తు పత్రాలు
కంగుతిన్న పోస్టుమెన్ ఉద్యోగార్థులు హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం తపాలాశాఖ పోస్టుమెన్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో చాలామంది నిరుద్యోగ యువకులు సంబరపడి దరఖాస్తులు పంపారు. కానీ కేవలం తపాలాశాఖ వెబ్సైట్లో పొందుపర్చిన దరఖాస్తు కాలంను పూరించి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నా.. ఇలా దరఖాస్తులు అందటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వాటన్నింటిని తిరుగుటపాలో అభ్యర్థులకు పంపటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. అభ్యర్థుల అవగాహనలేమిని అవకాశంగా చేసుకుని దళారులు దరఖాస్తు పత్రాలు రూ.50 నుంచి రూ.200 చొప్పున అమ్మారు. 18తో గడువు సమాప్తం: 379 పోస్టుమెన్, 31 మెయిల్ గార్డ్స్ పోస్టుల కోసం తపాలాశాఖ గతనెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 18తో ముగియనుంది. ఇప్పుడు మ్యాన్యువల్ దరఖాస్తులు తిరుగుటపాలో రావటంతో అభ్యర్థులు హడావుడిగా ఆన్లైన్లో మళ్లీ దరఖాస్తు చేసే పనిలో పడ్డారు. కేవలం ఆన్లైన్లో అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని, అభ్యర్థుల www.appost.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు నింపి పంపాలని తపాలాశాఖ ఏపీ సర్కిల్ రిక్రూట్మెంట్ విభాగం అసిస్టెంట్ డైరక్టర్ శనివారం తెలిపారు.