తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్‌ విడుదల | AP Postal Recruitment 2018 relised | Sakshi
Sakshi News home page

తపాలా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

Published Sat, Apr 14 2018 11:55 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

AP Postal Recruitment 2018 relised - Sakshi

తిరుపతి అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ తపాలా శాఖ పరిధిలో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.శ్రీనివాసమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ కోసం గురువారం తపాలా శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్టు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌కు మే 12వ తేదీ వరకు అవకాశముందని వెల్లడించారు. దరఖాస్తు, పరీక్ష రుసుములను ఈ–పేమెంట్‌ విధానంలో మాత్రమే పోస్టాఫీసులో చెల్లించాలని కోరారు. తిరుపతి డివిజన్‌ పరిధిలోని అన్ని హెడ్, సబ్‌ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు తపాలా శాఖ వెబ్‌సైట్‌లను పరిశీలించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement