
Your Whatsapp Account Banned Or Deleted Did You Just Do This: వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది . అక్టోబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలను ఏడు గంటలపాటు నిలిచి పోయినా విషయం తెలిసిందే.
చదవండి: Menstruation app: కళ్లింత పెద్దవి చేసుకుని చూడొద్దు
వాట్సాప్‌ను సరిగ్గా వాడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒకవేళ వాట్సాప్‌ను మిస్‌యూజ్ చేశామనుకోండి అంతే సంగతులు..! వాట్సాప్ యాప్‌ను మిస్‌యూజ్ చేస్తోన్న వారిపై వాట్సాప్ కఠినవైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 20 లక్షల ఇండియన్ ఖాతాలను వాట్సాప్ మూసివేసింది. వాట్సాప్ పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయా యూజర్ల వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేస్తుంది. మీరు ఒక వేళ తెలిసి, తెలియాక వాట్సాప్‌కు విరుద్ధంగా చేశారంటే మీ అకౌంట్‌ను వాట్సాప్ బ్లాక్ చేస్తోంది.
మీరు ఇలా చేస్తే మీ వాట్సాప్ ఖాతా బ్లాక్...!
- థర్డ్ పార్టీ, లేదా మోడెడ్ వాట్సాప్ యాప్‌లను వాడకూడదు..!
వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్ యాప్స్ లభిస్తున్నాయి. జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్ తొలగిస్తుంది. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుంది.
- స్పామ్ మెసేజ్‌లను పంపితే...!
తెలియని నంబర్లకు స్పామ్‌మెసేజ్‌లను పంపితే వాట్సాప్ ఆయా యూజర్లను బ్లాక్ చేస్తోంది. ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపితే బ్లాక్ చేస్తోంది. రెసిపెంట్ ఒక వేళ మీరు పంపినా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించి వాట్సాప్‌కు రిపోర్ట్ చేస్తే మీ వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అవుతాయి.
చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..!