Cloning
-
క్లోనింగ్ ముప్పు : తక్షణమే ఆధార్ బయోమెట్రిక్ డేటా లాక్ చేయండి ఇలా..!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్టం పడటం లేదు.సైబర్ క్రైం నేరాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. మనం ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ మోసానికి పాల్పడుతున్న కొత్త తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేలిముద్రతో తస్కరించి బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు కాజేసిన ఘటన ఆందోళన రేపుతోంది. క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా దాదాపు లక్షల మేర టోకరా వేస్తున్నారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా, చివరికి మొబైల్ సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్‌తోపాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరం ఉన్న ప్రతి చోటా ఆధార్, ఫింగర్ ప్రింట్ ఇస్తాం. దీన్ని అదునుగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు పౌరుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, నగదు స్వాహా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డులోని వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఈ క్రమంలో UIDAI పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ డేటా లాక్ లేదా అన్ లాక్ ప్రక్రియ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బయోమెట్రిక్ లాకింగ్ ఎలా? ♦ ముందుగా మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ♦ మైఆధార్ పోర్టల్‌లోకి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. ♦ స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ అందులో లాక్, అన్‌లాక్ మీకు ఎలా ఉపయోగపడుతుందనేది వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. తరువాత టర్మ్స్ బ్యాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. ♦ Your Biometric Have Been Locked Successfully (బయో మెట్రిక్ విజయవంతంగా లాక్ చేయబడింది’) అనే సందేశం డిస్ప్లే అవుతుంది. ♦ లాక్ కాగానే లాక్ లేదా అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది. బయోమెట్రిక్ అన్‌లాక్ ఎలా? ♦పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. ఇలా ఉంటే బయోమెట్రిక్ లాక్ అయినట్టే. ♦అన్‌లాక్ ప్రక్రియ కోసం Please Select To Lock టిక్ చేసిన తరువాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ♦బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని మెసేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని, నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి ♦Your Biometrics Have Been Unlocked Successfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. ♦ తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది అనేది గమనించాలి -
వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే..
వైఎస్సార్ జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు ఎవరో విత్‌డ్రా చేశారని పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై కడప పోలీసులు విచారణ చేపట్టగా.. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా దందా సాగిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల ముఠా గుట్టు రట్టయింది. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న దందా బట్టబయలైంది. కడప పోలీసులు ఈ కేసును విజయవంతంగా ఛేదించి సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. విశాఖపట్నంలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.1.50 లక్షలు గల్లంతయ్యాయి. దీనిపై విచారించగా హరియాణలోని ఓ ముఠా దందా వెలుగుచూసింది. ఆన్లైన్లో రుణాలు ఇస్తామని చెప్పి ఓ సంస్థ ఆయన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు కాపీలతోపాటు వేలిముద్రలు కూడా తీసుకుంది. అనంతరం క్లోనింగ్ ద్వారా ఆయన బ్యాంకు ఖాతాల్లోని నగదును విత్‌డ్రా చేసేసింది. సాక్షి, అమరావతి: దేశంలో కొత్తరూపు సంతరించుకుంటున్న సైబర్ నేరాలకు తాజా ఉదాహరణలు ఇవి. ఏఈపీఎస్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్ ద్వారా వారి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ తరహా సైబర్ నేరాలు అధికమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ప్రకారం గత ఆరునెలల్లో దాదాపు నాలుగువేల కేసులు నమోదవడం ఈ తరహా సైబర్ నేరాల తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ రీతిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు అత్యధికంగా హరియాణలో కేంద్రీకృతం కాగా.. మరికొన్ని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ల నుంచి దందా సాగిస్తున్నాయని సైబర్ పోలీసుల విభాగం గుర్తించింది. సైబర్ మోసం ఇలా.. సైబర్ నేరగాళ్లు ఏఈపీఎస్ను దుర్వినియోగం చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదును కొట్టేస్తున్నారు. అందుకోసం రెండుమూడు తరహాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా వివిధ వెబ్సైట్ల నుంచి వ్యక్తుల వేలిముద్రలను ‘బటర్ పేపర్’పై కాపీచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ, ట్రెజరీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, ఆన్లైన్ రికార్డుల్లో నమోదైన వేలిముద్రలను కాపీచేస్తారు. అనంతరం క్లోనింగ్ ద్వారా నకిలీ సిలికాన్/రబ్బర్ వేలిముద్రలు తయారు చేస్తారు. ఆధార్ నంబరు అనుసంధానమైన వ్యక్తుల పేరిట ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. దీంతో ఆ వ్యక్తుల అసలైన ఆన్లైన్ ఖాతాలు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లు వారి నియంత్రణలోకి వస్తాయి. అనంతరం తాము క్లోనింగ్ చేసిన వేలిముద్రలు ఉపయోగించి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మరికొన్నిసార్లు బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్స్, ఏజెంట్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్లో బయోమెట్రిక్ డివైజ్ స్కానర్స్తో స్కాన్‌చేసి నగదు లాగేస్తున్నారు. మరికొన్ని ముఠాలు ఏకంగా ఆన్లైన్ రుణ కంపెనీల పేరిట నకిలీ సంస్థలను ప్రారంభిస్తున్నాయి. రుణాలు ఇస్తామని ఆన్లైన్లో ప్రకటనలు చేస్తున్నాయి. రుణాల కోసం తమను సంప్రదించే వ్యక్తుల పాన్‌కార్డులు, ఆధార్‌కార్డుల కాపీలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నాయి. అనంతరం క్లోనింగ్ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును తస్కరిస్తున్నాయి. ఆధార్ నంబర్లతో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోని నగదును పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా కూడా సిఫోనింగ్ చేసి మరీ ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఇలా పలు రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తతే శ్రీరామరక్ష బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అందుకు ఖాతాదారులతోపాటు ప్రభుత్వ సంçÜ్థలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ♦కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ వెబ్సైట్లను ఎవరూ హ్యాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦తమ వెబ్సైట్లను తరచు సేఫ్టీ ఆడిట్ చేయాలి. ♦ప్రజల వ్యక్తిగత సమాచారం లీక్‌కాకుండా తగిన ప్రమాణాలు పాటించాలి. ♦అందుకోసం కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఖాతాదారులకు సూచనలు ఏఈపీఎస్ విధానాన్ని తరచు వినియోగించని ఖాతాదారులు ఆ సౌలభ్యాన్ని ఉపసంహరించుకోవాలి. వెబ్సైట్లలో తమ వేలిముద్రలు నమోదు చేయకూడదు. ఎటువంటి వ్యవహారం కోసమైనా సరే వేలిముద్రలు అడిగితే తిరస్కరించాలి. తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని గుర్తిస్తే 24 గంటల్లోనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీంతో వారి ఖాతానుంచి నగదు బదిలీ అయిన ఖాతాను సైబర్ పోలీసులు స్తంభింపజేయడానికి అవకాశం ఉంటుంది. సైబర్ నేరం జరిగినట్టు తెలియగానే ఏపీ సైబర్‌మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100)నుగానీ, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930)ను గానీ సంప్రదించి ఫిర్యాదు చేయాలి. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
వాట్సాప్‌లో ఇలా చేశారో..! మీ అకౌంట్‌ను మర్చిపోవాల్సిందే..!
Your Whatsapp Account Banned Or Deleted Did You Just Do This: వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు. స్మార్ట్ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది . అక్టోబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలను ఏడు గంటలపాటు నిలిచి పోయినా విషయం తెలిసిందే. చదవండి: Menstruation app: కళ్లింత పెద్దవి చేసుకుని చూడొద్దు వాట్సాప్‌ను సరిగ్గా వాడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒకవేళ వాట్సాప్‌ను మిస్యూజ్ చేశామనుకోండి అంతే సంగతులు..! వాట్సాప్ యాప్‌ను మిస్యూజ్ చేస్తోన్న వారిపై వాట్సాప్ కఠినవైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 20 లక్షల ఇండియన్ ఖాతాలను వాట్సాప్ మూసివేసింది. వాట్సాప్ పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయా యూజర్ల వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేస్తుంది. మీరు ఒక వేళ తెలిసి, తెలియాక వాట్సాప్‌కు విరుద్ధంగా చేశారంటే మీ అకౌంట్‌ను వాట్సాప్ బ్లాక్ చేస్తోంది. మీరు ఇలా చేస్తే మీ వాట్సాప్ ఖాతా బ్లాక్...! థర్డ్ పార్టీ, లేదా మోడెడ్ వాట్సాప్ యాప్‌లను వాడకూడదు..! వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్ యాప్స్ లభిస్తున్నాయి. జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్ తొలగిస్తుంది. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుంది. స్పామ్ మెసేజ్‌లను పంపితే...! తెలియని నంబర్లకు స్పామ్మెసేజ్లను పంపితే వాట్సాప్ ఆయా యూజర్లను బ్లాక్ చేస్తోంది. ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపితే బ్లాక్ చేస్తోంది. రెసిపెంట్ ఒక వేళ మీరు పంపినా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించి వాట్సాప్‌కు రిపోర్ట్ చేస్తే మీ వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అవుతాయి. చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..! -
కొబ్బరి చెట్లకు క్లోనింగ్
తిరువనంతపురం: చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియం యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. బెల్జియంలోని కె.యు.ల్యువెన్ అండ్ అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించే వీలుంది. వీరు సాధించిన విజయం భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ‘అసాధ్యమని భావిస్తున్న కొబ్బరి క్లోనింగ్‌ను మేం సాధించాం. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుంది’ ఈ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు చెప్పారు. తమ విధానంపై పేటెంట్ కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్‌లో ప్రచురితమయ్యాయి. -
బ్యాంకు పిన్ నెంబరును... కచ్చితంగా మార్చుకోవాలి
సాక్షి, సిటీబ్యూరో : మాగ్నెటిక్ స్ట్రిప్‌తో కూడిన డెబిట్/క్రెడిట్ కార్డుల్ని నేరగాళ్లు తేలిగ్గా క్లోనింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో బ్యాంకులు చిప్‌తో కూడిన కార్డుల్ని అమలులోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు వీటికీ సైబర్ క్రిమినల్స్ దాడి తప్పట్లేదు. ఈ కార్డుల్నీ క్లోన్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బుధ, గురువారాల్లోనే ఇద్దరు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఓ గ్రాఫిక్ డిజైనర్ నుంచి రూ.50 వేలు, సోమాజిగూడకు చెందిన మరో యువకుడి ఖాతా నుంచి రూ.40,500 ఈ రకంగా కాజేశారు. మొదటి కేసులో బీహార్‌లోని గయ, రెండో ఉదంతంలో నెల్లూరులోని ఏటీఎం కేంద్రాల నుంచి నగదు డ్రా అయింది. ఈ కేసులు నమోదు చేసిదర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు కార్డు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చేతిలో ఇమిడే స్కిమర్మర్లతో తస్కరణ... మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటున్నాయి. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని ఖరీదు చేస్తున్న సైబర్ నేరగాళ్ళు వివిధ వాణిజ్య సముదాయాల్లో ఉండే తమ అనుచరులకు అప్పగిస్తున్నారు. వీటిని నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్న ఆ అనుచరులు తమ వద్ద షాపింగ్‌కు వచ్చిన వచ్చిన వినియోగదారులు డబ్బు చెల్లింపు కోసం డెబిట్/క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు అదును చూసుకుని ఆ కార్డును ఈ స్కిమ్మర్‌లోనూ ఒకసారి పెట్టి తీస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం వీటిలో నిక్షిప్తమవుతుంది. కస్టమర్ టైప్ చేసేప్పుడు పిన్ నెంబర్‌ను గమనిస్తున్నారు. ఆపై వినియోగదారుడి కార్డును అతడికి తిరిగి ఇచ్చేస్తున్నారు. కంప్యూటర్/ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి... క్రెడిట్/డెబిట్ కార్డుకు సంబంధించిన డేటామొత్తం చిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. దుండగుల తమ వద్ద ఉన్న స్కిమ్మర్‌లో కార్డు ఆ వైపునే పెట్టి తీయడంతో డేటా తస్కరణకు గురవుతోంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్ల, తాము గుర్తించిన పిన్ నెంబర్లను ఈ అనుచరులు ప్ర«ధాన సూత్రధారులకు అందిస్తుంటారు. వీటిని సైబర్ నేరగాళ్ళు తన ల్యాప్‌టాప్/కంప్యూటర్లకు కనెక్ట్ చేసి వాటిలోకి అప్లోడ్ చేస్తుంటారు. ఆపై ఈ డేటాను డార్క్ నెట్ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. దీన్ని ఖరీదు చేస్తున్న దుండగులు రైటర్లను ఖరీదు చేసి, తమ కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లకు అనుసంధానిస్తుంటారు. ఇలాంటి మిషన్లన్నీ అత్యధికం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయి. ఆన్లైన్లో ఖరీదు చేస్తున్న చిప్‌లతో కూడిన ఖాళీ కార్డులను ఈ ల్యాప్‌టాప్/కంప్యూటర్లకు కనెక్ట్ చేసి ఒక్కో కార్డు డేటాను రైట్ చేసి క్లోన్డ్ కార్డులు రూపొందించేస్తుంటారు. అంటే మన క్రెడిట్‌కార్డుకి నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట. దేశంలోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లు ఇలా తయారైన క్లోన్డ్ కార్డుల్ని వినియోగించడానికి ఈ నేరగాళ్ళు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. వారికి కార్డులు, పిన్ నెంబర్లను పంపిస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు లేని ఏటీఎం కేంద్రాలను గుర్తించే ఈ ఏజెంట్లు డబ్బు డ్రా చేస్తూ ఉంటారు. ఆ మొత్తంలో కొంత కమీషన్ మినహాయించుకుని మిగిలింది సూత్రధారులకు అందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎంపిక చేసుకున్న స్వైపింగ్ మిషన్ కలిగిన వారికి అందిస్తూ అక్కడ స్వైపింగ్ చేయిస్తాయి. ఇలా తమ ఖాతాల్లో పడిన మొత్తాన్ని స్వైపింగ్ మిషన్ హోల్డర్లు కొంత కమీషన్ తీసుకుంటూ సైబర్ నేరగాళ్ళకు అప్పగిస్తుంటారు. ఈ రకంగా మనకు తెలియకుండానే క్లోనింగ్ కార్డు ద్వారా మన ఖాతా ఖాళీ అయిపోతుంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి: ♦ క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుకవైపు ఉండే సిగ్నేచర్ ప్యానల్లో సంతకం చేయాలి. ♦ బ్యాంకు అధికారులు పంపిన పిన్ నెంబరును అలాగే వాడేయకుండా... కచ్చితంగా మార్చుకోవాలి. ♦ క్రెడిట్/డెబిట్ కార్డు వెనుక వైపు ఉండే సీవీవీ కోడ్‌లో చివరకు మూడు అంకెలూ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, కార్డు పై నుంచి వాటిని చెరిపేయాలి. ♦ మీ క్రెడిట్/డెబిట్ కార్డును దుకాణం, వెయిటర్ తదితరులకు ఇస్తే... అది తిరిగి మీ చేతికి వచ్చే వరకు దృష్టి మళ్లనీయకండి. ♦ ఇటీవల కోవిడ్ భయం నేపథ్యంలో అనేక మంది వ్యాపారులు, ఆయా దుకాణాల్లోని వారు కార్డులు స్వైప్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడిగి వాళ్ళే ఎంటర్ చేసుకుంటున్నారు. ♦ కొన్ని పరిíస్థితులు మినహాయిస్తే వీలున్నంత వరకు దీనికి అనుమతి ఇవ్వొద్దని అధికారులుసూచిస్తున్నారు. -
ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరు ఒడిశాకు చెందిన ముఠాగా గుర్తించినట్లు తెలిపారు. గచ్చిబౌలి హెడీఎఫ్సీ మేనేజర్ ఫిర్యదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా నిందితులు 140 క్లోనింగ్ ఏటీఎం కార్డుల సాయంతో రూ. 13 లక్షలు విత్ డ్రా చేసినట్లు తేలింది. నిందితుల నుంచి రూ. 10 లక్షలతో పాటు స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోన్డ్ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
స్కిమ్మింగ్.. క్లోనింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలే టార్గెట్‌గా డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అబిడ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయంవిదితమే. రొమేనియాకు చెందిన ఇద్దరు లండన్ వాసి క్రిస్ట్ ఆదేశాలతో ఏటీఎం మెషిన్లకు స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు అమర్చి డేటా చోరీ చేశారు. అయితే నగరంలోనూ ఇలాంటి హైటెక్ ముఠాలు ఉన్నాయని... అవి స్కిమ్మింగ్, క్లోనింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా పబ్లిక్ ప్లేసులే అడ్డాగా చేసుకొని దందా కొనసాగించే ఈ ముఠాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఈ ముఠాలు క్లోనింగ్,స్కిమ్మింగ్ చేసే విధానాలను వివరిస్తున్నారు. అంతా అరచేతిలోనే... ఈ సైబర్ నేరగాళ్లు మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలను ఇంటర్నెట్, డార్క్ వెబ్ ద్వారా చైనా నుంచి ఖరీదు చేసి దిగుమతి చేసుకుంటున్నారు. నగరంలోని పెట్రోల్ బంక్‌లు, హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్ తదితర చోట్ల హెల్పర్స్‌గా పనిచేసే వారిని మచ్చిక చేసుకొని వారికి ఈ పరికరాలను అందిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని వాళ్లు నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్నారు. వినియోగదారుల్లో ఎవరైనా డబ్బు చెల్లింపు కోసం డెబిట్ కార్డు ఇచ్చినప్పుడు అదను చూసి ఆ కార్డును తమ అరచేతిలోని స్కిమ్మర్‌లోనూ ఒకసారి స్వైప్ చేస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం స్కిమ్మర్కు చేరుతోంది. ఆపై దాన్ని పీఓఎస్ మెషిన్లో స్వైప్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయడం కోసం వినియోగదారుడికి అందిస్తుంటారు. కస్టమర్ ఎంటర్ చేసే పిన్ను జాగ్రత్తగా గమనిస్తారు. ఈ తంతు పూర్తయిన తర్వాత కార్డును వినియోగదారుడికి తిరిగి ఇచ్చేస్తుంటారు. రైటర్‌తో ల్యాప్‌టాప్‌లోకి... డెబిట్ కార్డుకు సంబంధించిన డేటా మొత్తం దాని వెనుక ఉండే నల్లని టేపు లాంటి మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. స్కిమ్మర్‌లో కార్డును ఉంచి స్వైప్ చేయడంతో డేటా అందులోకి చేరుతుంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్లను ఈ పాత్రధారులు అసలు సూత్రధారులకు అందిస్తారు. ఇలా చేసినందుకు వీరికి కమీషన్ లేదా కొంత మొత్తం సూత్రధారుల నుంచి అందుతుంది. కేవలం డేటా మాత్రమే ఇచ్చిన కార్డుల కంటే పిన్ నంబర్‌తో సహా అందించిన వారికే కమీషన్ ఎక్కువ ఇస్తారు. ఈ డేటాను అందుకునే సూత్రధారులు ల్యాప్‌టాప్‌కు స్కిమ్మర్లు కనెక్ట్ చేయడం ద్వారా వాటిలోకి అప్లోడ్ చేస్తారు. అనేక సందర్భాల్లో ఈ సమాచారాన్ని సూత్రధారులు విదేశాల్లోని తమ అనుచరులకు అందిస్తారు. డార్క్ వెబ్ ద్వారానూ విక్రయించే దందా జోరుగా సాగుతుంటుంది. ఖాళీ కార్డు టు క్లోన్డ్ కార్డు సూత్రధారులు ఇంటర్నెట్ లేదా డార్క్ వెబ్ ద్వారానే మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్‌తో కూడిన ఖాళీ కార్డులను కొనుగోలు చేస్తుంటారు. వీటిని ల్యాప్‌టాప్‌కు అనుసంధానించిన రైటర్లో ఉంచి.. అందులోకి క్లోన్ చేసిన వాటిలో ఓ కార్డు డేటా ట్రాన్స్ఫర్ చేసి క్లోన్డ్ కార్డు రూపొందిస్తారు. అంటే వినియోగదారుడి కార్డుకు నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట. దీన్ని తీసుకొని వాళ్లు షాపింగ్, ఆన్లైన్లో లావాదేవీలు చేయడం, డబ్బు డ్రా చేసుకోవడం చేస్తుంటారు. పీఓఎస్ మెషిన్లు ఉన్న కొందరు చిన్న చిన్న వ్యాపారులకు ఈ నేరగాళ్లు కమీషన్ల వల వేస్తున్నారు. దీంతో వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా స్వైపింగ్ మెషిన్లో స్వైప్ చేసి నగదు ఇస్తూ కమీషన్ తీసుకుంటున్నారు. ఓ కన్నేయండి... కేవలం డెబిట్ కార్డులనే కాదు క్రెడిట్ కార్డులనూ క్లోన్ చేసే ఆస్కారం ఉంది. కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కార్డు ఎదుటి వ్యక్తి చేతికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే వరకూ గమనిస్తూ ఉండాలి. పీఓఎస్ మెషిన్లో పిన్ నంబర్ మీరే ఎంటర్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు అది ఎవరూ గమనించకుండా రహస్యంగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ను ఎంటర్ చేసుకొమ్మని ఎదుటి వ్యక్తికి చెప్పకూడదు. ఈ తరహా సైబర్ నేరాల్లో రికవరీలు కష్టసాధ్యం. ఈ నేపథ్యంలో నేరాల బారినపడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. – సైబర్ క్రైమ్ పోలీసులు రొమేనియా ఎంబసీకి లేఖ రాస్తాం నగరంలోని ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని ప్రత్యేక ఉపకరణాల ద్వారా డెబిట్ కార్డుల క్లోనింగ్‌కు పాల్పడుతున్న డినీట వర్జిల్ సొరైనెల్, జార్జ్ క్రిస్టియన్లను అరెస్టు చేశాం. వీరి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌కు చెందిన క్రిస్ట్ వీరి తో పాటు మరికొందరు రొమేనియన్లనూ క్లోనింగ్ దందా కోసం భారత్‌కు పంపాడని వెల్లడైంది. వీళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దిగారని తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించి ఆ వివరాలతో రొమేనియన్ ఎంబసీకి లేఖ రాసి సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. డినీట, జార్జ్లన కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుంది. – మధ్య మండల పోలీసులు -
ఇక క్లోనింగ్ పిల్లి కూనలు మార్కెట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ : మనకు కుక్క పిల్లలంటే ఎంత ముద్దో. ఐరోపా దేశాల ప్రజలకు పిల్లి కూనలంటే అంతకంటే ఎక్కువ ముద్దు. ఇష్టపడి పెంచుకున్న పిల్లిగానీ, పిల్లి కూనగాని మరణిస్తే వారు కూడా మనిషి చనిపోయిన దానికన్నా ఎక్కువే బాధ పడతారు. అలాంటి వారికి అచ్చంగా చనిపోయిన పిల్లికూనలాంటి పిల్లికూననే అందిస్తే వారి ఆనందానికి అంతుండదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. చైనాలోని ఓ బయోటెక్నాలజీ కంపెనీ క్లోనింగ్ ద్వారా ‘బ్రిటిష్ షార్ట్ హేర్ కిటెన్’ను సృష్టించింది. బీజింగ్‌లోని సినోజీన్ బయోటెక్నాలజీ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి పిల్లి కూనకు జన్మనిచ్చింది. ఈ పిల్లి కూనకు ‘గార్లిక్’ అని నామకరణం కూడా చేశారు. హాంగ్ హూ అనే చైనీయుడి ఇష్టపడి పెంచుకున్న పిల్లి కూన మూత్రనాళం ఇన్ఫెక్షన్తో మరణించిందట. అచ్చం అలాంటి పిల్లి కూనే కావాలంటూ ఆయన సినోజీన్ బయోటిక్ కంపెనీని ఆశ్రయించారు. దాంతో వారు పిల్లి పిండాన్ని లాబరేటరీలో రూపొందించి ఓ అద్దె తల్లి (ఆడ పిల్లి) గర్భంలో ప్రవేశ పెట్టగా అది 66 రోజుల్లో గార్లిక్కు జన్మనిచ్చింది. చనిపోయిన పిల్లి, క్లోనింగ్ ద్వారా పుట్టిన పిల్లి కూన చూడడానికి ఒకే లాగా ఉంటాయని, అయితే గుణ, గణాల్లో కచ్చితంగా తేడాలు ఉంటాయని నిపుణలులు తెలిపారు. అన్ని పిల్లుల్లాగానే క్లోనింగ్ పిల్లి కూనకు కూడా అంతే ఆయుర్దాయం ఉంటుందని వారు చెప్పారు. పిల్లి కూన క్లోనింగ్‌కు దాదాపు 30 వేల పౌండ్లు (26 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయట. ఇక ఎవరికి పిల్లి కూన క్లోనింగ్ కావాలంటే దాదాపు 26, 27 లక్షల రూపాయలకు చేస్తామని లాబరేటరీ వర్గాలు తెలిపాయి. కుక్క పిల్లల కోసం కూడా క్లోనింగ్ చేస్తామని, వాటికి 38 లక్షల నుంచి 46 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బయో టెక్నాలజీ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. -
నగరంలో ఏటీఎం క్లోనింగ్ ముఠా
విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణం): ఏటీఎం క్లోనింగ్ ముఠాకు చెందిన ఒక వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... హర్యాణాకు చెందిన డ్రైవర్ వీరేంద్ర సింగ్, కులదీప్‌సింగ్ స్నేహితులు. వీరివురు సులువుగా డబ్బు సంపాదించాలని సందీప్ సింగ్ అనే వ్యక్తితో కలిసి ఏటీఎం క్లోనింగ్ ద్వారా ఏటీఎం కార్డు రూపొందించారు. దాని సాయంతో సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో కులదీప్ సింగ్, సందీప్ సింగ్‌లు ఢిల్లీ నుంచి విమానంలో నగరానికి వచ్చి విశాలాక్షినగర్‌లో గల సీ పిరల్ హోటల్లో గదులు బుక్ చేసుకుని విడిదిచేశారు. తరువాత నగరంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్లలో వినియోగదారుల కార్యకలాపాలను రహస్యంగా వీడియో రికార్డింగ్ చేసేవారు. ఏటీఎం కార్డు నంబరు, పిన్ నంబర్లను సేకరించి కార్డు క్లోనింగ్ చేసేవారు. ఒక్కోసారి వృద్ధులు, ఏటీఎం కార్డు వినియోగించలేని వారి నుంచి కార్డులు మార్చేసేవారు. తరువాత అక్కడి నుంచి హోటల్ గదికి వచ్చి కార్డులు క్లోనింగ్ చేసి తిరిగి సాయంత్రానికి హర్యాణా వెళ్లిపోయేవారు. అక్కడ ఏటీఎం కార్డుల ద్వారా రాంచీ, అంధేరీ, ముంబయి, అసన్సోల్, డియోఘర్, షిరిడీ ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేసేవారు. తిరిగి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలో పలుమార్లు వచ్చి ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి వాటి ద్వారా సుమారు రూ.60 లక్షలు డ్రా చేసుకుని వెళ్లారు. ఈ మేరకు రూ.50వేలలోపు డబ్బు గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో 40 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. అదే విధంగా తాజాగా ఈ నెల 21వ తేదీన కులదీప్ సింగ్, వీరేంద్రసింగ్ స్పైస్ జెట్ విమానంలో 12.30గంటల ప్రాంతంలో నగరానికి చేరుకుని మధురవాడలో విడిది చేశారు. గణేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు ఫోన్ చేసి దిలీప్ అనే వ్యక్తి నుంచి ద్విచక్రవాహనం తీసుకున్నారు. ఆ బైకు ఉపయోగించి 22వ తేదీన నగరంలో విశాలాక్షినగర్, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాల్లో ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్షిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్లలో వీరంద్రసింగ్ ఏటీఎం కార్డుల వివరాలు సేకరిస్తుంటే కులదీప్ సింగ్ బయట ఉండి పర్యవేక్షిస్తూ కార్డులు క్లోనింగ్ చేశాడు. కులదీప్‌సింగ్, వీరేంద్ర సింగ్ నగరానికి వచ్చినట్లు తెలుసుకున్న సైబర్ క్రైం పోలీసులు వారు విడిది చేసిన హోటల్ రూంలో తనిఖీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కులదీప్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. గదిలో ఉన్న వీరేంద్రసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ గోపీనాథ్ తెలిపారు. అతని వద్ద నుంచి క్లోనింగ్ చేసిన నాలుగు ఏటీఎం కార్డులు, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కార్డు ఒకటి, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏటీఎం సెంటర్లలో అపరిచితులను నమ్మొద్దు ఏటీఎం సెంటర్లలో అపరిచితులతో కార్డుల ద్వారా డబ్బు డ్రా చేయటం, పిన్ నంబర్లు చెప్పటం చేయవద్దని సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ సూచించారు. అలా చేయడం వల్ల ఏటీఎం కార్డులు మార్చేసే అవకాశంతో పాటు పిన్ నంబరు అపహరించే అవకాశం ఉందని, తద్వారా డబ్బులు డ్రా చేసే ప్రమాదం ఉందని తెలిపారు. నగరంలో క్లోనింగ్ ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. -
‘అవంతి’ని అప్రోచ్ అయ్యారు!
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమారుస్తూ వేలిముద్రల్ని క్లోనింగ్ చేసిన గ్యాంగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరు సంప్రదించిన కాలేజీల్లో వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కాలేజీ, ఆయన సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావుకు చెందిన నోవా ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి. వీటితో పాటు కోదాడలోని గేట్, కిట్స్ సంస్థలతోనూ వీరు సంప్రదింపులు జరిపారని గుర్తించారు. అయితే వివేకానంద కాలేజీలా మిగిలిన వాటికి నకిలీ వేలిముద్రలు తయారు చేసి ఇచ్చారా? అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రల క్లోనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అవంతి కాలేజీతో పాటు మిగిలిన వాటికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. జేఎన్టీయూ నిబంధనల కఠినతరంతో... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్డీ చేస్తూ అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసేవాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో పని చేయడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకో అధ్యాపకుడు ఉండాలి. అయితే అనేక కాలేజీలు దీన్ని పాటించలేకపోతున్నాయి. బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల ఘటనల నేపథ్యంలో జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానం అవలంభిస్తోంది. క్లోనింగ్ చేశారిలా... రామకృష్ణ సూచనతో శ్రీరామ్ ఓ ప్లాస్టిక్ కోటింగున్న కాగితంపై గ్లూ గన్‌తో ప్రొఫెసర్ల వేలిముద్ర సేకరిస్తా డు. దీని ఆధారంగా రామకృష్ణ ఒక్కో బోగస్ అధ్యాపకుడికి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేసేవాడు. ఆయా కళాశాలల యాజమాన్యా లు ప్రతి రోజూ ఈ వేలిముద్రల అచ్చుల్ని బయోమెట్రిక్ మిషన్‌లో వేలు పెట్టాల్సిన చోట పెట్టేవి. ఇలా ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్‌లో నమోదయ్యేలా చేసేవారు. కాలేజీలతో ఒప్పందాలు చేసుకుని... జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీల్లో ఉన్న బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో కాలేజీ యాజమాన్యాలు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. దీన్ని గుర్తించిన రామకృష్ణ వేలిముద్రలు క్లోనింగ్ చేసే విధానం తెలుసుకుని శ్రీరామ్ప్రసాద్తో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లోని కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్‌ప్రింట్స్ ఆర్డర్‌ను రామకృష్ణకు పంపించడం చేసేవాడు. ఎంటెక్ పూర్తి చేసి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని యాజమాన్యాలు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఎన్రోల్ చేసేవారు. వీరు కాలేజీకి వచ్చినప్పుడు శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్‌లో లోడ్ చేసేవాడు. రీయింబర్స్మెంట్ ‘సృష్టించారా’? ఈ గ్యాంగ్‌ను ఇటీవల హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో రామకృష్ణ, శ్రీరామ్‌తో పాటు బాటసింగారంలో ఉన్న వివేకానంద కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పోరెడ్డి సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఠాణాలో నమోదైన ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. సుదర్శన్ తమ సంస్థలో పని చేస్తున్నట్లు 29 మంది వేలిముద్రల్ని వీరితో తయారు చేయించాడు. ఈ గ్యాంగ్ విచారణలోనే అవంతి, నోవా, గేట్, కిట్స్ కాలేజీలను అప్రోచ్ అయినట్లు తేలింది. కేవలం సంప్రదించారా.. లేక వారికీ ఏవైనా అక్రమాలకు సహకరించారా.. అన్నదానిపై దృష్టి పెట్టారు. ఆయా కాలేజీలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ గ్యాంగ్ ‘నకిలీ విద్యార్థుల్నీ’తయారు చేసిందనే అనుమానాలున్నాయి. ఇతర వర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకున్నాయని, వీరి వేలిముద్రల ఆధారంగా ఫీజు రీ–యింబర్స్‌మెంట్ పొందారనే ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. -
రెస్టారెంట్ వెయిటర్లకు ఏటీఎం కార్డు ఇస్తున్నారా..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ రెస్టారెంట్లలో విందుకు వెళుతున్న కస్టమర్లు బిల్లు చెల్లించేందుకు ఇస్తున్న ఏటీఎం కార్డుల వివరాలను స్కిమ్మింగ్ ద్వారా సేకరించి క్లోనింగ్ కార్డులతో డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏటీఎం నుంచి రెండు విడతల్లో రూ.లక్ష డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ అందడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కిమ్మింగ్ మోసం వెలుగులోకివచ్చింది. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకిషర్మిలా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎంబీఏ మధ్యలోనే మానేసిన వారణాసికి చెందిన సుమిత్ జింగ్రాన్ ఓ కాల్సెంటర్లో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశాడు. ఈ సమయంలో స్కిమ్మింగ్ కార్డుల మోసాలపై అవగాహన పెంచుకున్న అతను సులభంగా డబ్బులు సంపాదించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా స్కిమ్మర్లు, ఎంఎస్ఆర్ యంత్రాలను, మాగ్నటిక్ స్ట్రిప్‌లను కొనుగోలు చేశాడు. పలు రెస్టారెంట్లలో కస్టమర్లు బిల్లు చెల్లించేందుకు వెయిటర్లకు కార్డులను ఇవ్వడం గుర్తించిన అతను వెయిటర్లతో కుమ్మక్కైతే మోసాలు చేయడం తేలికనే నిర్ణయానికి వచ్చాడు. దీంతో పలు ప్రధాన నగరాల్లోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో పనిచేసే వెయిటర్లను కలిసి స్కిమ్మింగ్ ద్వారా కార్డు వివరాలతో పాటు పిన్ నంబర్ సంపాదించి ఇస్తే ఒక్కో కార్డుకు రూ.రెండువేల చొప్పున ఇస్తానని ఎరవేశాడు. ఇందుకు అంగీకరించిన వెయిటర్లకు కార్డు వివరాలు, పిన్ నంబర్ సేకరించడంపై అవగాహన కల్పించేవాడు. ఈ నేపథ్యంలో గోవాలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న తన స్నేహితులు రఫిక్ ఫరూక్ ఖాన్, సచిన్ కుమార్‌లను కలిసి తన పథకాన్ని వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత రఫిక్, సచిన్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో పనిలో చేరారు. వారు బిల్లు చెల్లించేందుకు కస్టమర్లు ఇచ్చిన ఏటీఎం కార్డులను స్కిమ్మింగ్ చేయడంతో పాటు పిన్ నంబర్లు తెలుసుకొని సుమిత్ జింగ్రాన్‌కు అందించేవారు. 15 రోజులకోసారి ఆయా రెస్టారెంట్లు, బార్లకు వెళ్లి వారి నుంచి వివరాలు తీసుకొని ఎంఎస్ఆర్ యంత్రాల సహాయంతో డాటాను క్లోన్ చేసి ముంబైకి చెందిన కెవిన్ జెర్రీ డిసౌజా, ఢిల్లీకి చెందిన గౌరవ్ వర్మలకు ఇచ్చేవాడు. వారు ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసేవారు. వచ్చిన మొత్తంలో 15 శాతం వారికి కమీషన్‌గా ఇచ్చేవాడు. ఇదే తరహాలో హైదరాబాద్ కస్టమర్ల నుంచి దాదాపు రూ.15 లక్షలు డ్రా చేశారు. ఇతర నగరాల్లో దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సురేంద్రకు బంజారాహిల్స్‌లోని ఓ ఏటీఎం నుంచి రెండు దఫాలుగా రూ. లక్ష డ్రా అయినట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో పంజాబ్ పాటియాలో జింగ్రాన్, గౌరవ్‌వర్మ, సచిన్ కుమార్‌లను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై బుధవారం నగరానికి తీసుకొచ్చారు. అయితే కెవిన్ జెర్రీ డిసౌజాను అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. రఫిక్ ఫరూక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. గతంలోనూ వీరిని థానే పోలీసులతో పాటు పంజాబ్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు విచారణలో వెల్లడైంది. -
ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు క్లోనింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: చెన్నై కేంద్రంగా జరుగుతున్న క్రెడిట్ కార్డ్ మోసానికి పోలీసులు చెక్‌పెట్టారు. ఇంటర్నేషనల్ క్రెడిట్‌కార్డ్‌ల ద్వారా అక్రమ లావాదేవీలు చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఇటీవల క్రెడిట్ కార్డ్ మోసాలు ఎక్కువగా నమోదు కావడంతో రంగంలోకి దిగిన రాచకొండ్ స్పెషల్ ఆపరేషన్స్ టీం, సైబర్ క్రైమ్ పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్‌లో ఈ ముఠాను అదుపులోకి తీసుకుంది. క్లోనింగ్ చేసిన కార్డు ద్వారా ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. వినియోగదారుల ఫిర్యాదుతో నిఘా పెట్టిన పోలీసు అధికారులు చెన్నైకి చెందిన ఐదుగురి సభ్యుల ముఠాను అరెస్ట్ చేసింది. వీరిలో చెన్నైకు చెందిన అయ్యప్పన్ (30), ఒంగోలుకు చెందిన రాఘవేంద్ర (32) కొత్తపేట నుంచి పల్లెచెర్ల కృష్ణ (25), విశాఖపట్నానికి చెందిన చల్లా భాస్కర్‌రావు (43) వనస్థలిపురం నుంచి సిద్దుల భాస్కర్ ఉన్నారు. వీళ్లంతా జాయింట్‌గా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, ఇందులో కమిషన్ ఏజెంట్‌గా పనిచేసిన , ఐటీ ఇంజనీర్ అయ్యప్పన్ కీలకమని పోలీసులు చెప్పారు.గత మూడు నెలలనుంచి దాదాపు రూ.30లక్షలను దోచుకున్నారని రాచకొండ కమిషనర్ మహేష్ ఎం భగవత్ వెల్లడించారు. వీరు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ద్వారా ఒకరినొకరు కలుసుకుని కార్డులను క్లోన్ చేయం ప్రారంభించారన్నారు. ఇలా క్లోనింగ్ చేసిన కార్డు ద్వారా ఆయా ఖాతాల్లోని డబ్బును తమ ఖాతాలోకి మళ్లించుకుంటారు. నిందితుల దగ్గరనుంచి భారీ మొత్తంలో పీఓఎస్ మెషిన్లను, ల్యాప్ టాప్‌ను మెగ్నటిక్ కార్డును, నగదును స్వాధీనం చేసుకున్నామని కమిషన్ తెలిపారు. అలాగే ఈ లావాదేవీకోసం ఎలాంటి ఓటీపీ , పిన్ నెంబర్ అవసరం ఉండదని పేర్కొన్నారు. -
క్రెడిట్ కార్డు క్లోనింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ సిటీ: క్రెడిట్ కార్డులు క్లోనింగ్ చేసి నగదు డ్రా చేసే అంతర్జాతీయ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, పీఓఎస్ మెషిన్, మాగ్నెటిక్ కార్డ్ రీడర్, రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని నిందితులు పలు సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఇందులోతమిళనాడుకు చెందిన అయ్యప్పన్ అలియాస్ రాజేష్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాఘవేంద్రరావు, వంశీకృష్ణ, మరో ఇద్దరు విదేశీయులు కలిసి క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి, వారి పిన్ నెంబర్ ఆధారంగా కార్డులను క్లోనింగ్ చేసి ఇప్పటివరకు రూ.30 లక్షల నగదు డ్రా చేశారని పోలీసులు తెలిపారు. క్లోనింగ్ చేయడంలో రాజేష్‌కు నైపుణ్యం ఉంది. బిన్ చెక్కర్ అప్లికేషన్ ద్వారా కార్డ్ వివరాలు తెలుసుకుంటారు. పీఓఎస్ మెషిన్ వాడే వారు వీరికి సమాచారం సమాధానం ఇస్తారు. అందుకుగాను వారికి 20 శాతం వాటా ఇస్తారు. కార్డు క్టోనింగ్ ద్వారా మోసం చేసిన్నట్టు సమాచారం అందడంతో వారిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. -
స్వైపింగ్ మిషన్లతో రూ.కోటి స్వాహా
హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా జే అండ్ కే బ్యాంక్ నుంచి క్రెడిట్/డెబిట్ కార్డుల స్వైపింగ్ మిషన్లు తీసుకుని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోటి మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సిటీ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. నగరానికి చెందిన మామిడి మహేష్.. జే అండ్ కే బ్యాంక్‌లో నాలుగు కరెంట్ ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా బ్యాంకు అధికారులు వ్యాపార లావాదేవీల కోసం ఫిబ్రవరిలో అతడికి నాలుగు స్వైపింగ్ మిషన్లు జారీ చేశారు. ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధిలో నమోదైన బందిపోటు దొంగతనం కేసులో మహేష్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే అతడికి కోర్టు జీవిత ఖైదు విధించడంతో జైలుకు వెళ్తూ తన నాలుగు స్వైపింగ్ మిషన్లను తన స్నేహితుడైన కిరణ్‌కుమార్‌కు అప్పగించాడు. వీటిని వినియోగించేందుకు కిరణ్ వనస్థలిపురం ప్రాంతంలో చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి చెందిన చాంద్‌పాషాతో ఇతనికి పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు కార్డులకు సంబంధించిన పిన్ నంబర్, డేటా తెలుసునని కిరణ్‌తో చెప్పాడు. స్వైపింగ్ మిషన్లు తనకు అప్పగిస్తే అక్రమ లావాదేవీల ద్వారా వచ్చే మొత్తంలో 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు. ఎలాంటి శ్రమ లేకుండా కమీషన్ వస్తోందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించిన కిరణ్‌కుమార్ నాలుగు స్వైపింగ్ మిషన్లను చాంద్‌పాషాకు అప్పగించాడు. తొలుత వనస్థలిపురంలో ఉన్న దుకాణం నుంచి చాంద్‌పాషా తన దందా ప్రారంభించాడు. ఆపై వీటిని కేరళకు చెందిన అబుబాకర్‌కు అందించాడు. ఇతగాడు ఈ స్వైపింగ్ మిషన్లలో స్వైప్ చేయడానికి అవసరమైన క్లోన్డ్ కార్డుల్ని కేరళలోని కసరకోడ్ ప్రాంతానికి చెందిన యూసుఫ్ నుంచి తీసుకుంటున్నాడు. ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండానే ఈ కార్డుల్ని నాలుగు స్వైపింగ్ మిషన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేష్‌కు చెందిన కరెంట్ ఖాతాల్లో పడేట్లు చేస్తున్నాడు. ఆ ఖాతాలకు సంబంధించిన వివరాలు తెలిసిన కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలిన నగదును అబుబాకర్ చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ వ్యవహారాలు నెరపడానికి కిరణ్‌కు రామ్‌ప్రసాద్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలింది కార్డులు, డేటా అందించిన యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. నగరంలో ఉన్న వారితో సంప్రదించేందుకు అబుబాకర్‌ను హిందీ రాకపోవడంతో కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకారం తీసుకుంటున్నాడు. ఈ గ్యాంగ్ రెండు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అనేక క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోటి స్వాహా చేసింది. ఈ ఏడాది మేలో జే అండ్ కే బ్యాంక్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల నుంచి ఈ మేరకు ఫిర్యాదులు అందాయి. వీరు జారీ చేసిన స్వైపింగ్ మిషన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలియకుండానే వారి కార్డుల్ని క్లోనింగ్ చేసి, నగదు కాజేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో జే అండ్ కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం అధికారులు దర్యాప్తు చేశారు. వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. ఇప్పటికే జైల్లో ఉన్న మహేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్ కోసం గాలిస్తున్నారు. అతడు చిక్కితే కార్డుల్ని ఎలా క్లోనింగ్ చేస్తున్నారు? బ్యాంకు వినియోగదారుల డేటా, పిన్ నంబర్లు ఎలా సంగ్రహిస్తున్నాడు? అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు. -
‘స్మార్ట్’గా దోచేస్తారు!
క్లోనింగ్ బారిన పడితే మన ఖాతా ఖాళీ.. టెక్నాలజీ వినియోగంలో పైచేయి సాధిస్తున్న అక్రమార్కులు డూప్లికేట్ కార్డులతో డబ్బులు స్వాహా ఏటీఎం కేంద్రాల్లో పొంచి ఉన్న ముప్పు అప్రమత్తంగా ఉంటేనే అన్ని విధాలా మేలు డబ్బులు ఇంట్లో ఉంటే భద్రత ఉండదని ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాల్లో వేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగుల జీతాలను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాయి. ఖాతాలో డబ్బులు ఉండడంతో అవసరమైనప్పుడు ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే వెలుసుబాటుంది. అలా ఏటీఎం మనిషి నిత్య జీవితంలో ఓ భాగమైంది. ఇలా అందరు సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకెళ్తుంటే దొంగలు సైతం తామేమీ తక్కువా? అన్నట్టుగా మనకంటే ఓ అడుగు ముందుకేసి టెక్నాలజీని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. మన ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తూ డబ్బులను ఎంచక్కా దోచేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. - పంజగుట్ట ముంబైకి చెందిన ఏడుగురు స్నేహితులు. వీరిలో చదువు రాని వారితోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులూ ఉన్నారు. కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలనే కోరిక వీరిలో బలంగా నాటుకుంది. చోరీలే ఇందుకు సరైన మార్గమని భావించారు. ఎవరికీ అనుమానం రాకుండా ‘స్మార్ట్’గా దోచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నకిలీ డెబిట్ కార్డులను సృష్టించి ఏటీఎంల ద్వారా డబ్బులు కాజేసేందుకు పథకం రచించారు. గత ఆదివారం సాయంత్రం నగరంలోని రాజ్‌భవన్ రోడ్డులో ఏటీఎం వద్ద అనుమానంగా తిరుగుతున్న ముంబైకి చెందిన హైదర్అలీ అలియాస్ అజ్జు, అవిత్ అశోక్శెట్టిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సదరు నిందితులపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 32 కేసులు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా వీరిపై కేసులు ఉన్నాయి. మిగిలిన ఐదుగురితోపాటు హైదరాబాద్‌లో ఈ గ్యాంగ్‌కు షెల్టర్ ఇచ్చే జాఫర్ హఫీజ్ ఖాన్‌లను త్వరలో పట్టుకుంటామని పంజగుట్ట ఎసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్డుల క్లోనింగ్ విధానం... ఇందుకోసం మ్యాగ్నటిక్ రిఫ్లికా ఆఫ్ ఏటీఎం కార్డ్ స్లాట్ అనే యంత్రాన్ని తయారు చేశారు. రిఫ్లికా అనేది తొడుగు. దీన్ని ఏటీఎం సెంటర్లో ఏటీఎం కార్డు లోనికి వెళ్లే చోట గమ్‌తో అతికిస్తారు. రిఫ్లికా అతికించే ముందే అందులో ఓ సాఫ్ట్వేర్ చిప్, అది పనిచేసేందుకు బ్యాటరీని అమరుస్తారు. సరిగ్గా మన ఏటీఎం పిన్ నంబర్ ఎంటర్‌చేసే కీ ప్యాడ్‌కు పైన ఓ పెన్‌డ్రైవ్, దానికి 16 జీబీ మెమోరి కార్డు, 8 మెగా పిక్సల్ సెల్ఫోన్లో వినియోగించే చిన్న కెమెరా ఏర్పాటు చేసి దాన్ని గమ్ స్టిక్‌తో అతికిస్తారు. రిఫ్లికాలో ఉన్న బ్యాటరీ సుమారు 6 గంటలు పనిచేస్తుంది. ఖాతాదారుడు వచ్చి తన కార్డును ఏటీఎం మిషన్‌లో పెట్టగానే రిఫ్లికాలో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా కార్డుపై ఉండే 18 అంకెలు అందులో ఫీడ్ అవుతాయి. ఖాతాదారుడు పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో పైన అమర్చిన కెమెరా షూట్ చేస్తుంది. ఆరు గంటల్లో ఆ ఏటీఎం సెంటర్‌కు ఎంతమంది వస్తే అంతమందికి చెందిన పూర్తి డేటా కెమెరా, రిఫ్లికాలో ఫీడ్ అవుతుంది. గోవాలో నకిలీ కార్డుల తయారీ.. రిఫ్లికా, కెమెరా ద్వారా సేకరించిన డేటాను గోవాకు తీసుకెళ్తారు. క్లోనింగ్ ద్వారా నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి వాటిపై అవే నంబర్లు ముద్రిస్తారు. సదరు నంబర్‌కు ఉన్న పిన్ నంబర్‌ను కూడా ఓ పేపర్‌పై రాసి నకిలీ ఏటీఎంకు అంటిస్తారు. అలా ఒక్కోసారి సుమారు 70 నుంచి 100 వరకు నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేయిస్తారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తారు. ముంబై ముఠా నేరాల చిట్టా... 2012లో మొదటిసారి గోవాలో ఓ బ్యాంక్ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి 70 నకి లీ ఏటీఎంలు తయారు చేయించారు. వాటిని గోవాతోపాటు హైదరాబాద్‌కు తీసుకొచ్చి నగరంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.12 లక్షలు డ్రా చేశారు. 2014 జనవరిలో నగరంలోని లైఫ్‌స్టైల్ భవనంలో ఉన్న ఓ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి సుమారు 60 నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి హైదరాబాద్‌లో సుమారు రూ.7 లక్షలు డ్రా చేశారు. 2014 మార్చిలో రాజ్‌భవన్ రోడ్డులోని ఎస్బీహెచ్ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి సుమారు 100 కార్డులు తయారు చేసి ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.10 లక్షలు డ్రా చేశారు. తాజాగా గత ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌రోడ్డులో ఏటీఎం వద్ద అనుమానంగా తిరుగుతున్న ముంబైకి చెందిన హైదర్అలీ అలియాస్ అజ్జు, అవిత్ అశోక్శెట్టిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పై వివరాలను వెల్లడించారు. మిగిలిన ఐదుగురితోపాటు హైదరాబాద్‌లో ఈ గ్యాంగ్‌కు షెల్టర్ ఇచ్చే జాఫర్ హఫీజ్ ఖాన్‌లను త్వరలో పట్టుకుంటామని పంజగుట్ట ఎసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సూచనలు పాటించండి మరి... ఏటీఎం సెంటర్లలో అప్రమత్తంగా ఉండాలి. మిషన్ కీబోర్డుపైన ఏవైనా కెమెరాలు ఉన్నాయేమో ఓ సారి చూసుకోవాలి. ఠీపిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో జాగ్రత్త అవసరం. రద్దీగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలకు వెళ్లడమే కొంతవరకు బెటర్. ఠీసెక్యూరిటీ గార్డు ఉన్న సెంటర్‌కే వెళ్లాలి. -
బ్యాంకు మేనేజర్‌నంటూ మోసం
కమ్మర్పల్లి : బ్యాంకు మేనేజర్‌నని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకున్నాడు. క్లోనింగ్ చేసిన కార్డుతో వివిధ దుకాణాల్లో షాపింగ్ చేసి రూ. 15,630 డ్రా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ పవార్ బాలాజీకి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆయన ఫోన్‌కు ఆదివారం రాత్రి 70338 71737 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. నీ ఏటీఎం పిన్ నంబర్ మారిందని తెలిపాడు. పాత నంబర్ చెప్పాలని కోరాడు. దీంతో బాలాజీ తన కార్డు నంబర్ తెలిపాడు. అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ పెట్టేశాడు. అనుమానం వచ్చిన బాలాజీ.. వెంటనే కమ్మర్‌పల్లిలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే ఏటీఎం బంద్ ఉండడంతో మెట్పల్లి ఎస్బీహెచ్ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని చూశాడు. అనేబుల్ టు ప్రాసెస్ అని రిసిప్ట్ రావడంతో నివ్వెరపోయాడు. సోమవారం కమ్మర్పల్లి ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లి తన ఖాతాకు సంబంధించి లావాదేవీలు చూడగా ఆదివారం ఒక్కరోజే ఏడు దఫాలుగా రూ. 15,630 డ్రా అయినట్లు తేలింది. కార్డు తన వద్ద ఉండగానే ఖాతాలోని నగదు ఎలా విత్‌డ్రా అయ్యిందని బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు. పిన్ నంబరు చెప్పడం వల్ల అజ్ఞాత వ్యక్తి షాపింగ్ ద్వారా డబ్బులు డ్రా చేసి ఉంటాడని మేనేజర్ పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు.