సాక్షి, హైదరాబాద్ సిటీ: క్రెడిట్ కార్డులు క్లోనింగ్ చేసి నగదు డ్రా చేసే అంతర్జాతీయ ముఠాను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, పీఓఎస్ మెషిన్, మాగ్నెటిక్ కార్డ్ రీడర్, రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని నిందితులు పలు సైబర్ నేరాలకు పాల్పడ్డారు.
ఇందులోతమిళనాడుకు చెందిన అయ్యప్పన్ అలియాస్ రాజేష్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాఘవేంద్రరావు, వంశీకృష్ణ, మరో ఇద్దరు విదేశీయులు కలిసి క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి, వారి పిన్ నెంబర్ ఆధారంగా కార్డులను క్లోనింగ్ చేసి ఇప్పటివరకు రూ.30 లక్షల నగదు డ్రా చేశారని పోలీసులు తెలిపారు.
క్లోనింగ్ చేయడంలో రాజేష్‌కు నైపుణ్యం ఉంది. బిన్ చెక్కర్ అప్లికేషన్ ద్వారా కార్డ్ వివరాలు తెలుసుకుంటారు. పీఓఎస్ మెషిన్ వాడే వారు వీరికి సమాచారం సమాధానం ఇస్తారు. అందుకుగాను వారికి 20 శాతం వాటా ఇస్తారు. కార్డు క్టోనింగ్ ద్వారా మోసం చేసిన్నట్టు సమాచారం అందడంతో వారిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment