సాక్షి, హైదరాబాద్: చెన్నై కేంద్రంగా జరుగుతున్న క్రెడిట్ కార్డ్ మోసానికి పోలీసులు చెక్‌పెట్టారు. ఇంటర్నేషనల్ క్రెడిట్‌కార్డ్‌ల ద్వారా అక్రమ లావాదేవీలు చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఇటీవల క్రెడిట్ కార్డ్ మోసాలు ఎక్కువగా నమోదు కావడంతో రంగంలోకి దిగిన రాచకొండ్ స్పెషల్ ఆపరేషన్స్ టీం, సైబర్ క్రైమ్ పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్‌లో ఈ ముఠాను అదుపులోకి తీసుకుంది.
క్లోనింగ్ చేసిన కార్డు ద్వారా ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. వినియోగదారుల ఫిర్యాదుతో నిఘా పెట్టిన పోలీసు అధికారులు చెన్నైకి చెందిన ఐదుగురి సభ్యుల ముఠాను అరెస్ట్ చేసింది. వీరిలో చెన్నైకు చెందిన అయ్యప్పన్ (30), ఒంగోలుకు చెందిన రాఘవేంద్ర (32) కొత్తపేట నుంచి పల్లెచెర్ల కృష్ణ (25), విశాఖపట్నానికి చెందిన చల్లా భాస్కర్‌రావు (43) వనస్థలిపురం నుంచి సిద్దుల భాస‍్కర్ ఉన్నారు. వీళ్లంతా జాయింట్‌గా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, ఇందులో కమిషన్ ఏజెంట్‌గా పనిచేసిన , ఐటీ ఇంజనీర్ అయ్యప్పన్ కీలకమని పోలీసులు చెప్పారు.గత మూడు నెలలనుంచి దాదాపు రూ.30లక్షలను దోచుకున్నారని రాచకొండ కమిషనర్ మహేష్ ఎం భగవత్ వెల్లడించారు. వీరు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ద్వారా ఒకరినొకరు కలుసుకుని కార్డులను క్లోన్ చేయం ప్రారంభించారన్నారు. ఇలా క్లోనింగ్ చేసిన కార్డు ద్వారా ఆయా ఖాతాల్లోని డబ్బును తమ ఖాతాలోకి మళ్లించుకుంటారు. నిందితుల దగ్గరనుంచి భారీ మొత్తంలో పీఓఎస్ మెషిన్లను, ల్యాప్ టాప్‌ను మెగ‍్నటిక్ కార్డును, నగదును స్వాధీనం చేసుకున్నామని కమిషన్ తెలిపారు. అలాగే ఈ లావాదేవీకోసం ఎలాంటి ఓటీపీ , పిన్ నెంబర్ అవసరం ఉండదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment