మాల్‌వేర్ దాడుల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించాలనే నేపథ్యంలో గూగుల్ ఏకంగా 22 యాప్స్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్ వినియోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు పరిశోధనలో తెలియడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కొన్ని యాప్స్ కారణంగా మొబైల్ ఛార్జింగ్ వేగంగా అయిపోవడంతో పాటు.. డేటా కూడా వేగంగా ఖాళీ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులు వీటిని మాన్యువల్‌గా తొలగించాలి. ఇప్పటికే ఈ యాప్స్ 2.5 మిలియన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. వీరందరూ ఈ యాప్స్ వీలైనంత త్వరగా తొలగించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల సంపద- సన్యాసుల్లో కలిసిపోయారు!
గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన యాప్స్ జాబితాలో బారో టీవీ, DMB యాప్, Jihosoft మొబైల్ రికవరీ యాప్, మ్యూజిక్ బడా, మ్యూజిక్ డౌన్‌లోడర్, బారో డిజిటల్ గిఫ్టింగ్ యాప్, న్యూ లైవ్, రింగ్‌టోన్స్ ఫ్రీ మ్యూజిక్, స్ట్రీమ్‌కార్ లైవ్ స్ట్రీమింగ్, లైవ్‌ప్లే, OnAir ఎయిర్‌లైన్ మేనేజర్, మ్యూజిక్ ప్లేయర్ - ఆడియో ప్లేయర్, AT ప్లేయర్, ట్రోట్ మ్యూజిక్ బాక్స్-ఫ్రీ ట్రోట్ మ్యూజిక్ ప్లేయర్ మొదలైనవి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment