టెక్ దిగ్గజం గూగుల్ (Google) పది భారతీయ కంపెనీల యాప్‌లపై చర్య తీసుకుంటున్నట్లు ఈ రోజు (మార్చి 1) వెల్లడించింది. ఎక్స్‌టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్లింగ్ విధానాన్ని పాటించని కారణంగా కంపెనీ వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది.
గూగుల్ తొలగించనున్న యాప్‌ల జాబితాలో మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారమ్ షాదీ.కామ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ALTT, స్టేజ్ మాత్రమే కాకుండా.. డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. ఈ యాప్స్ అన్నీ కూడా ప్లే స్టోర్‌కు ఫీజులు చెల్లించకపోవడం వల్ల వీటిని పూర్తిగా తొలగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
యాప్ డెవలపర్లు కూడా గూగుల్ మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఇందులో గూగుల్ గేట్ కీపింగ్ చార్జీలు, ఎక్స్‌ట్రా కమీషన్స్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. యాప్ డెవలపర్ల నుంచి తక్కువ ఫీజులే వసూలు చేస్తున్నట్లు తెలిపింది.
గూగుల్ ప్లేలో ప్రస్తుతం 200000 మంది భారతీయ యాప్ డెవలపర్‌లు తమ విధానాలకు కట్టుబడి ఉన్నారని, సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌ను నిర్ధారిస్తున్నారని కంపెనీ తెలిపింది. అయితే 10 కంపెనీలు మాత్రమే తమ నియమాలను పెడచెవిన పెడుతున్నాయని, ఈ కారణంగానే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
ఇదీ చదవండి: అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్: పాప్ సింగర్ ఒక్క పర్ఫామెన్స్‌కే అన్ని కోట్లా?
Comments
Please login to add a commentAdd a comment