
సాక్షి, హైదరాబాద్: లెజెండరీ నటి హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ అప్రతిహతంగా దూసుకపోతోంది. అటు విమర్శకుల ప్రశంసలతోపాటు ఇటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం కురుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే డిలిటెడ్ సన్నివేశాల వీడియోలు ఆకట్టుకుంటున్న తీరు మరో ఎత్తు. మహానటి సినిమా ఎంత సంచలన విజయాన్నిసృష్టిస్తోందో..అంతకంటే ఎక్కువగా డిలీటెడ్ సీన్లు, వీడియోలు యూట్యూబ్‌లో హల్ చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్ కీర్తి సురేష్‌పై చిత్రీకరించిన ఒక ఆసక్తికర సన్నివేశం నెట్‌లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన డిలీటెడ్ వీడియోలు, సన్నివేశాలు ఇప్పటికే పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చాలా పాటలను, సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసివేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా ఎంజాయ్ చేయండి!
Comments
Please login to add a commentAdd a comment