Pop Singer Ariana Grande Deletes Her Twitter Account, Details Inside - Sakshi
Sakshi News home page

Ariana Grande: క్రిస్మస్‌ రోజే ట్విటర్ ఖాతా తొలగించిన అరియానా.. ఫ్యాన్స్‌ షాక్‌ !

Published Sun, Dec 26 2021 3:26 PM | Last Updated on Sun, Dec 26 2021 7:49 PM

Ariana Grande Deletes The Twitter Account On Christmas - Sakshi

Ariana Grande Deletes The Twitter Account On Christmas: హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండె తన పాటలు, నటనతో ఎంతో పేరు తెచ్చుకుంది. 2013-2014 మధ్యలో వచ్చిన 'సామ్‌ అండ్‌ క్యాట్‌' టీవీ షోతో మరింత పాపులర్‌ అయింది అరియానా.  అలాగే 'ది వాయిస్‌' సీజన్‌కు న‍్యాయనిర్ణేతగా కూడా కనిపించి అలరించింది. సోషల్‌ మీడియా పుణ్యమా అని అరియానా గ్రాండె పేరు ఈ సంవత్సరం ఎక్కువగా వినిపించింది. ఈ ఏడాది మేలో లాస్‌ ఏంజెల్స్‌ లగ్జరీ రియల్టర్‌ డాల్టన్‌ గోమెజ్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చిన అరియానా తాజాగా మరోసారి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా శుక్రవారం (డిసెంబర్‌ 25) క్రిస్మస్‌ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలందరూ తమ ఫొటోలను, క్రిస్మస్‌ వేడుకలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 

ఈ క్రమంలో క్రిస్మస్‌ రోజు తన ట్విటర్‌ ఖాతా తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది అరియానా. ఎలాంటి సమాచారం లేకుండా తన అకౌంట్‌ డిలీట్‌ చేయడంతో అభిమానులు షాక్‌ అయ్యారు. ఇంతకీ ఏమైందా అని ఆరా తీశారు అరియానా ఫ్యాన్స్‌. అరియానా సైబర్‌ వేదింపులకు గురయి ఉంటుందని, అందుకే డిలీట్ చేసిందని కొందరు భావిస్తున్నారు. లేదా తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటనతో వచ్చేందుకు ఇలా చేసిందా అని తికమక పడుతున్నారు. ఆమె మీద ట్రోలర్స్‌ ప్రభావం పడిందేమోనని, వారివల్లే ఖాతా తొలగించిందేమో అని ఆరోపిస్తున్నారు. ​ఆమె మళ్లీ ట్విటర్‌లోకి రావాలని అరియానా ఫ్యాన్స్‌ తెగ కోరుకుంటున్నారు. 
 

బ‍్యాంగ్‌ బ్యాంగ్‌, బ్రేక్‌ ఫ్రీ, సైట్‌ టు సైడ్‌ వంటి హిట్‌ సాంగ్స్‌ పాడిన అరియానా గ్రాండె ఇన్‌స్టా గ్రామ్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉంది. తన తాజా నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం డోంట్‌ లుక్‌ అప్ ప్రచార చిత్రాలను షేర్‌ చేసింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్‌ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టా వేదికగా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. మెర్రీ.. బీ సేఫ్‌, ఐ లవ్‌ యూ అని స్టోరీ షేర్‌ చేసింది ఈ బ్యూటీఫుల్‌ సింగర్‌.



ఇదీ చదవండి: తన నివాసంలో ప్రియుడిని పెళ్లాడిన పాప్‌ సింగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement