
న్యూయార్క్: తప్పుడు సమాచారాన్ని అందించే వెబ్‌సైట్లపై టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కొరడా ఝులిపించింది. నకిలీవార్తలతో పాటు యాజమాన్యం, దాని ముఖ్యోద్దేశం, సొంత దేశం తదితర వివరాలను రహస్యంగా ఉంచే వెబ్‌సైట్లను తమ న్యూస్ ఫీడ్ నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ ఆదివారం పలు మార్గదర్శకాలు విడుదలచేసింది. ‘మీ గురించి లేదా మీ ఉద్దేశం గురించి తప్పుడు వివరాలు అందజేయవద్దు. మా న్యూస్ ఫీడ్‌లో ఉండే సైట్లు వినియోగదారుల్ని తప్పుదారి పట్టించడాన్ని అంగీకరించం’ అని గూగుల్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment