గూగుల్‌ను అడిగితే చెప్పలేందంటూ ఉండదు. దాదాపు ప్రపంచంలోని అన్ని అంశాలకు చెందిన సమాచారం అంతా అందులో దాగిఉంది. ఏదైనా వస్తువు కొనాలంటే వెంటనే గూగుల్‌లోకి వెళ్లి రేటింగ్ చూడటం అలవాటైంది. కానీ నిజంగా అందులో ఇస్తున్న సమీక్షల్లో నిజమెంతనే అనుమానం రాకపోదు. కొందరు కావాలనే కొన్ని ప్రొడక్ట్‌లకు ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ రేటింగ్ ఇస్తూ సామాన్యులను మోసం చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది.
గూగుల్ తన కొత్త మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి గూగుల్ మ్యాప్స్, సెర్చింగ్ లో 170 మిలియన్లకు పైగా పాలసీ ఉల్లంఘించే రివ్యూలను బ్లాక్ చేసినట్లు తెలిసింది. గతేడాది కంటే 45 శాతం ఎక్కువ నకిలీ రివ్యూలను తొలగించేందుకు ఈ అల్గారిథమ్ సహాయపడిందని గూగుల్ తెలిపింది. వీటితోపాటు 12 మిలియన్లకు పైగా నకిలీ వ్యాపార ప్రొఫైల్‌లను గుర్తించి బ్లాక్ చేసినట్లు చెప్పింది.
గతేడాది గూగుల్ తన కొత్త మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ప్రారంభించింది. ఇది రోజువారీ దీర్ఘకాలిక సంకేతాలను పరిశీలించి వేగంగా నకిలీ రివ్యూలను గుర్తిస్తుంది. దీంతోపాటు వీడియో మోడరేషన్ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా 2023లో 14మిలియన్ల పాలసీ ఉల్లంఘనల వీడియోలను గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. ఇది గతేడాది కంటే 7 మిలియన్లు ఎక్కువ. 2 మిలియన్ల హ్యాకర్ అటెంప్ట్‌ల నుంచి వ్యాపార యజమానులను రక్షించినట్లు గూగుల్ పేర్కొంది. ఇది 2022లో 1 మిలియన్‌గా ఉంది.
గూగుల్ గుర్తించినవాటిలో చాలావరకు కొన్ని సంస్థలకు చెందిన ప్రొడక్ట్‌ల రివ్యూలు ఫేక్ అని తేలింది. కొన్ని ఉత్పత్తులకు తక్కువ సమయంలోనే పాలసీలు, నియమాలకు విరుద్ధంగా 5స్టార్ రేటింగ్‌లు, అనధికార రివ్యూలు వస్తున్నట్లు గమనించారు. కొన్నింటికి 1 స్టార్ రేటింగ్‌లు వస్తున్న ఘటనలు ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ఒకప్పటి ఆర్థిక అద్భుతం.. కోల్పోయిన మరో స్థానం
అనుమానాస్పద యాక్టివిటీస్ గుర్తించిన తర్వాత 1.23 లక్షల కంటే ఎక్కువ వ్యాపారాలపై తాత్కాలిక రక్షణ కల్పించినట్లు గూగుల్ పేర్కొంది. గతేడాది మ్యాప్స్ లో చిన్న వ్యాపారాలపై ఫేక్ రివ్యూస్ పోస్ట్ చేసిన నటుడిపై గూగుల్ దావా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment