
ఢిల్లీ : ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వంద మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ తొలగింపుల అంశం పీఎంవో కార్యాలయానికి చేరింది. దీంతో ఇన్ఫోసిస్‌లో అసలేం జరగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇటీవల, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 100 అభ్యర్థులకు ఇన్ఫోసిస్ అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించింది. అయితే, ఆ టెస్టులో ఉద్యోగులు ఫెయిలయ్యారు. దీంతో వారిని విధుల నుంచి తొలగించింది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు పొందేలా జోక్యం చేసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఫిర్యాదు అనంతరం కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక కార్మిక కమిషనర్‌కు మరో లేఖ జారీ చేసింది. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో తొలగించిన ట్రైనీ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోవాలని, ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 25న జారీ చేసిన లేఖలో పేర్కొంది.
రెండేళ్ల తర్వాత ఉద్యోగాలు
ఇన్ఫోసిస్ రెండేళ్ల క్రితం వందల మంది ఫ్రెషర్స్‌ని నియమించుకుంది. వెంటనే వారిని విధుల్లో తీసుకోలేదు. రెండేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్‌లో విధుల్లోకి తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా వారిలో 300 మందికి పైగా ఫ్రెషర్స్‌కు అసెస్‌మెంట్ ఎగ్జామ్ నిర్వహించింది. అందులో ఫ్రెషర్స్ ఫెయిల్ అయ్యారనే కారణంతో విధుల నుంచి తొలగించింది. దీనిపై ఐటీ రంగంలో దుమారం చెలగరేగింది. ఇన్ఫోసిస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ ఖండించింది. కేంద్రం కార్మిక శాఖ జోక్యం చేసుకుని ఇన్ఫోసిస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదే అంశంపై నైట్స్ పీఎంవో కార్యాలయానికి లేఖరాసింది. ఆ లేఖపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. పీఎంవో కార్యాలయానికి ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ తొలగింపులపై ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులో అభ్యర్థులు తమ ఉద్యోగం తిరిగి పొందేలా, భవిష్యత్తులో ఇతర ఉద్యోగుల్ని అక్రమంగా తొలగించకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొంది.
ఆందోళన చేస్తాం
మరోవైపు, ఇన్ఫోసిస్‌లో లేఆప్స్‌పై ఉద్యోగుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు మేము ఉద్యోగులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారుల్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే లేఆఫ్స్ గురైన ఉద్యోగులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రకటించింది. వెంటనే ఈ సమస్యకు పరిష్కరం చూపేలా చర్యలు తీసుకోవాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment