Google Will Delete Millions Of Gmail And YouTube Accounts Soon, Deets Inside - Sakshi
Sakshi News home page

జీమెయిల్‌, యూట్యూబ్‌ యూజర్లకు అలర్ట్‌: త్వరలో అకౌంట్లు డిలీట్‌!

Published Wed, May 17 2023 9:27 PM | Last Updated on Thu, May 18 2023 10:32 AM

Gmail YouTube accounts delete soon - Sakshi

మీకు జీమెయిల్, యూట్యూబ్‌ అకౌంట్లు ఉన్నాయా.. క్రియేట్‌ చేసి చాలా కాలం అవుతోందా.. తరచూ ఉపయోగించడం లేదా.. అయితే ఆ అకౌంట్లు త్వరలో డిలీట్ అయ్యే అవకాశం ఉంది. 

మనలో చాలా మందికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కొంత మంది అవసరంకొద్దీ రెండు.. మూడు.. ఇలా లెక్కకు మించి జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ అకౌంట్లను ఒకసారి కూడా ఓపెన్ చేయరు. రెండేళ్లకుపైగా ఉపయోగంలో లేని అలాంటి ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ త్వరలో డిలీట్ చేయనుంది.

ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్‌! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో..

ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు సంబంధించి గూగుల్ కొత్త విధానాలను ప్రకటించింది. ప్రతి 24 నెలలకు ఒకసారి లాగిన్ అవ్వాలని, పాత గూగుల్ అకౌంట్లను సమీక్షించాలని యూజర్లను కోరింది. రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేయని అకౌంట్లలో స్టోర్ అయిన డేటా డిలీట్ అయ్యేలా ఇప్పటికే గూగుల్ ఒక విధానాన్ని కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని పూర్తిగా తమ సర్వర్ల నుంచి డిలీట్ చేయనుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గూగుల్ అకౌంట్ల కోసం ఇన్‌యాక్టివ్ విధానాన్ని మరో  రెండేళ్లకు అప్‌డేట్ చేస్తున్నట్లు గూగుల్‌ పేర్కొంది.

 

యూట్యూబ్‌, గూగుల్‌ ఫొటోస్‌పైనా ప్రభావం
కొత్త విధానం డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుందని ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్‌ పేర్కొంది. జీమెయిల్‌, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్‌, గూగుల్‌ ఫోటోస్‌ సహా ఇనాక్టివ్‌ అకౌంట్లలో స్టోర్‌ మొత్తం మొత్తం కంటెంట్ తొలగించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు 2020లో ప్రకటించిన విధానం ప్రకారం.. ఇనాపరేటివ్‌ అంకౌంట్లలోని  కంటెంట్‌ను మాత్రమే తొలగించేది. ఇప్పుడు తీసుకొచ్చిన విధానంలో అకౌంట్లను కూడా తొలగించే అవకాశం ఉంది.  ఈ విధానం వ్యక్తిగత గూగుల్‌ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు లేదా వ్యాపార సంస్థల అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని గూగుల్‌ పేర్కొంది.

తొలగించే ముందు నోటిఫికేషన్లు
ఉపయోగంలో లేని అకౌంట్లను గూగుల్‌ దశలవారీగా తొలగిస్తుంది. మొదటగా డిసెంబర్‌లో ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అకౌంట్‌ క్రియేట్‌ చేసి తర్వాత ఎప్పుడూ ఉపయోగించని అకౌంట్లను తొలి విడతలో తొలగించనుంది. ఇలా తొలగించే ముందు ఆ అకౌంట్లకు, దానికి సంబంధించి పేర్కొన్న రికవరీ అకౌంట్లకు నోటిఫికేషన్లు పంపుతుంది. కాబట్టి మీకు గూగుల్‌ అకౌంట్‌ ఉండి తరచూ ఉపయోగించకపోతే వెంటనే యాక్టివేట్‌ చేసుకోండి.

ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement