గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా తప్పించుకోండి! | How to Delete All Activity Manually on Google Search | Sakshi
Sakshi News home page

గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా తప్పించుకోండి!

Published Wed, Apr 21 2021 5:38 PM | Last Updated on Wed, Apr 21 2021 7:47 PM

How to Delete All Activity Manually on Google Search - Sakshi

గూగుల్ మీ కదిలకలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది అనే విషయం మీకు తెలుసా? మీరు షాపింగ్ కోసం ఏదైనా సేర్చ్ చేసిన, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిన, మీరు యూట్యూబ్ లో వీడియొలు చూసిన ఇలా ప్రతి చిన్న విషయాన్ని గూగుల్ మన కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాక్ చేయడం ద్వారా మన అభిరుచులు, ఇష్ట ఇష్టాలు తెలుసుకొని దానికి తగిన విదంగా ప్రకటనలు అందజేస్తుంది. ఎక్కువ శాతం మన డేటాను ప్రకటనల కోసం వాడుకుంటుంది. 

అలాగే, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని హెచ్చరిస్తుంది. మీ ప్రతి కదలికలను గమనించకూడదు అంటే మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మై యాక్టివిటీ గూగుల్ స్పెసిఫిక్ పేజీని సందర్శించాల్సి ఉంటుంది. అసలు మై యాక్టివిటీ అంటే ఏంటి? మీరు గూగుల్ నుంచి సేకరించిన సమాచారన్ని మొత్తం చూసేందుకు ఇక్కడే నిక్షిప్తమై ఉంటుంది. గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది. దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయి.ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తుంటాయి.

డిలీట్ చేయడం ఎలా?
ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ ప్రపంచంలో విహరించే వాళ్లకు దాదాపు జీ-మెయిల్ ఉంటుంది. అంటే మీకు గూగుల్‌లో ఒక ఖాతా ఉందన్నమాట. గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌తో ఈ ఖాతా అనుసంధానమై ఉంటుంది. గూగుల్‌లో మీరు ఏం వెతికినా, ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది. ఈ డేటాను తొలగించాలంటే మేను బార్ లో "డిలీట్ యాక్టివిటీ బై" అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఒక స్పెసిఫిక్ డే నుంచి గత వారం, గత నెల, మొత్తం డేటాను ఎప్పటికప్పుడు తొలగించే ఆఫ్షన్ను ఎంచుకోవచ్చు.

యూట్యూబ్‌లో మీరు వెతికే ప్రతి వీడియో సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. ఈ చరిత్రను కూడా సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ లింక్‌పై క్లిక్ చేయండి. ఎడమ వైపున "హిస్టరీ" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ", "క్లియర్ వాచ్ హిస్టరీ" వాటిని ఎంచుకోవాలి. లేదా మీరు కోరుకున్న సమాచారాన్ని డిలీట్ చేయొచ్చు. అలాగే, లొకేషన్ హిస్టరీ కూడా గూగుల్ ట్రాక్ చేయకుండా నిలిపివేయవచ్చు. ఇలా ప్రతి విషయాన్ని గూగుల్ ఏమి ట్రాక్ చేయాలో, వద్దో అనేది మనం నిర్ణయించుకోవచ్చు. మీరు మీ డేటాను తొలగించిన మాత్రాన ప్రకటనలు మాత్రం ఆగిపోవు. కానీ, మీ డేటాను డిలీట్ చేయడం వల్ల సైబర్ నెరగాళ్ల భారీన పడకుండా ఉంటుంది. 

చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement