google data
-
గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా తప్పించుకోండి!
గూగుల్ మీ కదిలకలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది అనే విషయం మీకు తెలుసా? మీరు షాపింగ్ కోసం ఏదైనా సేర్చ్ చేసిన, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిన, మీరు యూట్యూబ్ లో వీడియొలు చూసిన ఇలా ప్రతి చిన్న విషయాన్ని గూగుల్ మన కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాక్ చేయడం ద్వారా మన అభిరుచులు, ఇష్ట ఇష్టాలు తెలుసుకొని దానికి తగిన విదంగా ప్రకటనలు అందజేస్తుంది. ఎక్కువ శాతం మన డేటాను ప్రకటనల కోసం వాడుకుంటుంది. అలాగే, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని హెచ్చరిస్తుంది. మీ ప్రతి కదలికలను గమనించకూడదు అంటే మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మై యాక్టివిటీ గూగుల్ స్పెసిఫిక్ పేజీని సందర్శించాల్సి ఉంటుంది. అసలు మై యాక్టివిటీ అంటే ఏంటి? మీరు గూగుల్ నుంచి సేకరించిన సమాచారన్ని మొత్తం చూసేందుకు ఇక్కడే నిక్షిప్తమై ఉంటుంది. గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది. దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయి.ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తుంటాయి. డిలీట్ చేయడం ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ ప్రపంచంలో విహరించే వాళ్లకు దాదాపు జీ-మెయిల్ ఉంటుంది. అంటే మీకు గూగుల్‌లో ఒక ఖాతా ఉందన్నమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో ఈ ఖాతా అనుసంధానమై ఉంటుంది. గూగుల్‌లో మీరు ఏం వెతికినా, ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది. ఈ డేటాను తొలగించాలంటే మేను బార్ లో "డిలీట్ యాక్టివిటీ బై" అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఒక స్పెసిఫిక్ డే నుంచి గత వారం, గత నెల, మొత్తం డేటాను ఎప్పటికప్పుడు తొలగించే ఆఫ్షన్‌ను ఎంచుకోవచ్చు. యూట్యూబ్‌లో మీరు వెతికే ప్రతి వీడియో సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. ఈ చరిత్రను కూడా సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ లింక్‌పై క్లిక్ చేయండి. ఎడమ వైపున "హిస్టరీ" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ", "క్లియర్ వాచ్ హిస్టరీ" వాటిని ఎంచుకోవాలి. లేదా మీరు కోరుకున్న సమాచారాన్ని డిలీట్ చేయొచ్చు. అలాగే, లొకేషన్ హిస్టరీ కూడా గూగుల్ ట్రాక్ చేయకుండా నిలిపివేయవచ్చు. ఇలా ప్రతి విషయాన్ని గూగుల్ ఏమి ట్రాక్ చేయాలో, వద్దో అనేది మనం నిర్ణయించుకోవచ్చు. మీరు మీ డేటాను తొలగించిన మాత్రాన ప్రకటనలు మాత్రం ఆగిపోవు. కానీ, మీ డేటాను డిలీట్ చేయడం వల్ల సైబర్ నెరగాళ్ల భారీన పడకుండా ఉంటుంది. చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు! -
వెంటాడే గూగుల్ నిఘా
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మీపై నిఘా పెడుతోందా? మీరు వద్దన్నా సరే మీ రాకపోకలు, మేసేజ్‌లు అన్నింటిని రికార్డు చేస్తోందా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. తమ ప్రయాణ వివరాలు రికార్డు చేయవద్దని సెట్టింగ్స్ పెట్టినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల సమాచార సేకరణను ఆపడంలేదు. అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ సంచలనాత్మక విషయం వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా పౌరుల సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు. ‘గూగుల్ మ్యాప్స్’ వాడేటప్పుడు యూజర్ ఉన్న లొకేషన్ తెల్సుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలా చేస్తే ప్రజలు ఫోన్‌తో ఏ చోట్లకెళ్లారు? అక్కడ ఎంతసేపున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది. అయితే ఇది ఇష్టం లేని యూజర్ల కోసం ‘లొకేషన్ హిస్టరీ ఆప్షన్’ను ఆఫ్ చేసే సౌకర్యాన్ని గూగుల్ తెచ్చింది. దీన్నివాడితే యూజర్లు ఎక్కడున్నారో రికార్డు కాదని గూగుల్ చెప్పింది. తాజాగా పరిశోధకులు ఇది అబద్ధమని తేల్చారు. లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేసినా కొన్ని గూగుల్యాప్స్ కస్టమర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తున్నాయని తేల్చారు. గూగుల్ మ్యాప్ యాప్‌ను ఒక క్షణం ఓపెన్ చేసినా స్క్రీన్ షాట్ ఆటోమేటిక్‌గా గూగుల్ తీసేసుకుంటోందని పరిశోధకులు తెలిపారు. ఆటోమేటిక్‌గా వాతావరణం గురించి చెప్పే యాప్స్ కూడా యూజర్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని గూగుల్‌కు పంపిస్తూనే ఉంటాయి. లొకేషన్‌కు సంబంధం లేని మరికొన్ని యాప్స్ అయితే కేవలం 30 సెం.మీ కచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని గూగుల్‌కు అందజేస్తున్నాయి. 200 కోట్ల మందికి పైగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ రికార్డు చేసిందన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్ వారి సమాచారాన్ని దొంగతనంగా సేకరించిందని ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వేర్వేరు మార్గాల్లో తాము యూజర్ల సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్ ప్రతినిధి చెప్పారు. యూజర్లు myactivity.google.com ద్వారా తమ సెర్చింగ్లు, ఇతర వివరాలను చూసుకోవచ్చు. -
మంత్రిగారు గూగుల్ చూసి చెప్పారట!!
వైద్య ప్రముఖులు చెప్పేదాని కంటే గూగులమ్మ చెప్పే విషయాల మీదే ఆరోగ్య మంత్రికి నమ్మకం ఎక్కువట. చికన్‌గున్యా వల్ల మరణాలు సంభవించవని, అలాగని గూగుల్ తనకు చెప్పిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెబుతున్నారు. అందుకే ఢిల్లీవాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆ లక్షణాలు కనపడితే జాగ్రత్తలు తీసుకుని, ఆస్పత్రికి వెళ్తే చాలని చెప్పారు. అక్కడ వైద్యులు చెబితేనే ఆస్పత్రిలో చేరాలి తప్ప లేకపోతే అక్కర్లేదన్నారు. ఢిల్లీలో ఒకే ఆస్పత్రిలో నలుగురు పేషెంట్లు చికన్ గున్యాతో చనిపోయారని.. మరి దానిగురించి ఏమంటారని ప్రశ్నిస్తే, ప్రపంచంలో ఎక్కడా చికన్ గున్యా మరణాలు లేవని.. కేవలం ఢిల్లీలో ఒక ఆస్పత్రిలోనే ఎందుకు ఉంటున్నాయని ఎదురు ప్రశ్నించడంతో పాటు వాళ్లు అప్పటికే వయసుమీరి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్లు తన విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు.