లక్షలాది డివైజ్‌లలో! జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ ఇతరత్ర సౌకర్యాలను బ్లాక్ చేసేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. రేపటి(సెప్టెంబర్ 27) నుంచి పాత స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సంబంధిత అకౌంట్లను శాశ్వతంగా పనిచేయకుండా నిలిపివేయనుంది.
గూగుల్ అకౌంట్ బ్లాక్ కాకుండా ఉండాలంటే.. ఫోన్లను అప్‌గ్రేడ్ చేయడం లేదంటే కొత్త మొబైల్‌కు మారిపోయి లాగిన్ అవ్వాల్సిందే. ఇలా చేయకపోతే జీమెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇతర గూగుల్ సేవలను పొందలేరని(యాప్స్ ద్వారా) గూగుల్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27 నుంచి 2.3 వెర్షన్ డివైజ్‌లలో ఆయా గూగుల్ యాప్స్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎర్రర్ వస్తుంది. అది కరెక్ట్ మెయిల్, పాస్‌వర్డ్ అయినా సరే.
చదవండి: ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఇక లీక్ కావా?
ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌తో నడుస్తోన్న స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సైన్ ఇన్ సపోర్ట్, ఇతరత్ర సేవలను నిలిపివేయనుంది. యూజర్ల భద్రత, డాటా పరిరక్షణ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం డివైజ్ తయారీదారులు చాలాకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ గూగుల్ మొండిగా ముందుకు పోతోంది. అయితే ఆ ఫోన్ బ్రౌజర్లో మాత్రం ఈ సర్వీసులను యూజర్లు పొందే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
చదవండి: గూగుల్ ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ చేస్తున్నారా?
ఫోన్ సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేయమని లేదా ఫోన్‌లనే మార్చేయమని గత కొంతకాలంగా గూగుల్, యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది కూడా. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను కల్గి ఉన్న స్మార్ట్‌ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈరోజుల్లో ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్.. అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ వెర్షన్స్‌నే వాడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఒకవేళ వాడుతుంటే గనుక తక్షణమే ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్(అప్‌గ్రేడ్) చేస్కోమని సూచిస్తోంది.
చదవండి: గూగుల్ క్రోమ్‌ను బీభత్సంగా వాడుతున్నారా?
ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్, ఐఫోన్లలో ఐవోఎస్ 15 వెర్షన్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి గూగుల్ ఒక్కో వెర్షన్‌ను రిలీజ్ చేస్తూ వస్తోంది. 2017లో ఆండ్రాయిడ్ 2.3 ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ పే సేవలను నిలిపివేసింది. అయితే ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్‌తో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఫోన్లు ఇవి.. Sony Xperia Advance, Lenovo K800, Sony Xperia Go, Vodafone Smart II, Samsung Galaxy S2, Sony Xperia P, LG Spectrum, Sony Xperia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532
Comments
Please login to add a commentAdd a comment