ఒక వ్యక్తికి లేదా ఒక గ్రూప్‌కు పంపాల్సిన మెసేజ్‌ను అనుకోకుండానో, పరధ్యానంలోనో వేరొకరికి పంపే సందర్భాలు వాట్సాప్ యూజర్‌లకు ఎదురవుతుంటాయి. ఈ హడావిడిలో ‘డిలిట్ ఫర్ ఎవ్రీ వన్’ క్లిక్ చేయడానికి బదులుగా ‘డిలిట్ ఫర్ మీ’ క్లిక్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ ‘రివర్స్ యాక్షన్’ కోసం ‘యాక్సిడెంటల్ డిలిట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా, మెసేజ్ డిలిట్ చేసిన తరువాత ‘మెసేజ్ డిలిటెడ్ ఫర్ మీ’ మెసేజ్‌తో చిన్న డైలాగ్‌బాక్స్ కనిపిస్తుంది. ఈ డైలాగ్‌బాక్స్‌లో చిన్న ‘అన్‌డూ’ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే డిలిట్ చేసిన మెసేజ్ మళ్లీ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కు అందుబాటులో ఉంటుంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..)
Comments
Please login to add a commentAdd a comment