
కొత్తగా గూగుల్(మెయిల్) ఉపయోగించేవారికి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వారి లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు. ‘మేం ఏదైనా ప్రొడక్ట్‌ను రూపొందిచేటప్పుడు ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, బాధతాయుతంగా ఉండటం, నియంత్రణలో ఉంచడం. ఈ విషయంలో మరింత భద్రతను కల్పించడం కోసం గూగుల్ సరికొత్త ఆవిష్కరణను ఈ రోజు మీ ముందుకు తీసుకు వచ్చింది. డేటాకు సంబంధించి కొన్ని మార్పులు చేశాం’ అని తెలిపారు. (గూగుల్ @కరోనా సెంటర్)
ఇక నుంచి గూగుల్ యూజర్ హిస్టరీ 18 నెలల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. డేటాను డిలీట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఆ పనిని మాన్యువల్‌గా చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా డిలీట్ కానుంది. ఇది గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలుపెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ- మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. వారు ఎంచుకునే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. దీంతో వినియోగదారుల భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వినియోగదారుల సెట్టింగ్స్‌ను గూగుల్ మార్చబోవడం లేదని కూడా తెలిపారు. ఈ ఆటోమెటిక్ డిలిట్ ఆప్షన్ జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌కు వర్తించదని వారు తెలిపారు. (అందుకే మిట్రాన్ యాప్ తొలగించాం: గూగుల్)
Comments
Please login to add a commentAdd a comment