టెక్ దిగ్గజం 'గూగుల్'.. క్వాంటం కంప్యూటింగ్‌లో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త క్వాంటం చిప్ విల్లోను ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ఈ కొత్త చిప్, కేవలం ఐదు నిమిషాల్లో సంక్లిష్టమైన గణిత సమస్యను విజయవంతంగా పరిష్కరించగలిగింది.
గూగుల్ పరిచయం చేసిన ఈ విల్లో చిప్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. విల్లో చిప్ ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగిన సమస్యను.. వేగవంతమై సూపర్ కంప్యూటర్ పరిష్కారించాలంటే 10 సెప్టిలియన్ (ఒకటి తరువాత 25 సన్నాలు ఉన్న సంఖ్య) సంవత్సరాలు పడుతుంది. ఇది విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువని గూగుల్ వెల్లడించింది.
ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!
విల్లోని పరిచయం చేస్తున్నాము, ఇది మా కొత్త లేటెస్ట్ క్వాంటం కంప్యూటింగ్ 'చిప్' అని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. వావ్ అని కామెంట్ చేశారు. ఆ తరువాత వీరిరువురి మధ్య కొంత సంభాషణ కూడా జరిగింది. ఇదంతా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Introducing Willow, our new state-of-the-art quantum computing chip with a breakthrough that can reduce errors exponentially as we scale up using more qubits, cracking a 30-year challenge in the field. In benchmark tests, Willow solved a standard computation in <5 mins that would…
— Sundar Pichai (@sundarpichai) December 9, 2024
Wow
— Elon Musk (@elonmusk) December 9, 2024
Comments
Please login to add a commentAdd a comment