మాట్లాడుతున్న నాగేశ్వర్‌రావు
అచ్చంపేట రూరల్ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని టీఎన్‌జీఓ భవనంలో సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ జీఓ వచ్చిన రోజని ఆ రోజున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించాలని కోరారు. సార్వత్రిక సమ్మెకు తమ మద్ధతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, శ్రీనివాస్, మక్బూల్‌అలీ, వెంకటేష్, రఘునాథ్‌రెడ్డి, అష్రఫ్, శంకర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.