
Samantha Deletes Pictures With Naga Chaitanya: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి వాళ్ల సోషల్ అకౌంట్లపై మరింత ఫోకస్ పెరిగింది. సాధారణంగానే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో షేర్‌చేస్తుంటుంది. చైతూతో విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల మందు నుంచి మై మమ్మా సెయిడ్(మా అమ్మ చెప్పింది) అంటూ వరుస పోస్టులు చేసిన సమంత ఈ మధ్యకాలంలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తుంది.చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్
విడాకుల ప్రకటనతో సామ్ మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు ఆమె పోస్టులను బట్టి అర్థం అవుతుంది. తాజాగా చైతూతో గడిపిన పాత జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి సమంత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీ చేసేసింది. అలా ఇప్పటివరకు సుమారు 80కి పైగా ఫోటోలను తన అకౌంట్ నుంచి సామ్ తొలగించింది.
కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పెట్‌డాగ్‌తో ఉన్న కలసి ఉన్న చైతూ ఫోటోలను మాత్రం అలాగే ఉంచేసింది. చివరగా చైతూ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి 'లాల్ సింగ్ చద్దా' పోస్టును షేర్ చేసిన సామ్ ఇప్పుడు ఆ పోస్టును డిలిట్ చేసింది. త్వరలోనే నాగ చైతన్యను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయనున్నట్లు తెలుస్తుంది.
చదవండి: నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున
మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్
సమంత కేసు: థంబ్‌నైల్స్ మా బాధ్యత కాదు.. సీఎల్ వెంకట్‌రావు
Comments
Please login to add a commentAdd a comment