
Venkatesh Shares Cryptic Post In Instagram About Relationship: హీరో వెంకటేశ్ ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇది వరకు కేవలం సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రమే షేర్ చేసే వెంకటేశ్.. ఈ మధ్య లైఫ్ లెసన్స్‌కు సంబంధించి వరుస పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నిత్యం రిలేషన్, నమ్మకం, ప్రేమ వంటి విషయాలపై ఏదో ఒక రకంగా నిత్యం కొటేషన్స్‌ను షేర్ చేస్తున్నారు. చదవండి: 'ఆ స్టార్ హీరోను తన్నిన వారికి నగదు బహుమతి'..సంచలన ప్రకటన
తాజాగా వెంకటేశ్ షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్ యూస్(దుర్వినియోగం) చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయవద్దు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోవద్దు' అంటూ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు.
ఇది చూసిన నెటిజన్లు ఈ కొటేషన్స్ చై-సామ్‌కు పరోక్షంగా హితబోధ చేస్తున్నారా అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వీళ్లు విడిపోకుండా ఉండేందుకు వెంకీ మధ్యవర్థిత్వం వహించారని, ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారని సమాచారం. అయినప్పటికీ సఖ్యత కుదరక చై-సామ్ భార్యభర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే.
చదవండి: శ్రీరామచంద్ర ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్న వాట్సాప్ చాట్
కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం