న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం తీసుకు వచ్చిన ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారులు తమ అకౌంట్‌ను తొలగించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. అంతేగాక ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారుని మొత్తం డేటాను కూడా డిలీట్ చేసేందుకు అనుమతిచ్చింది. అకౌంట్ డిలీట్ చేసిన 30 రోజులకు యాప్ నుంచి డేటా తొలగించడతుంది. అయితే అకౌంట్‌ను తొలగించడం వలన కేవలం ఫోన్ నుంచి మాత్రమే డేటా డిలీట్ అవుతుంది. ఇది ప్రభుత్వ సర్వర్ల నుంచి తీసివేసే వరకు వేచి ఉండాల్సిందే. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత యాజమానులకు)
కాగా ఆరోగ్య సేతులో వినియోగదారుడు తనకు కరోనా సోకిందా అన్న విషయంతోపాటు చుట్టుపక్కల కరోనా రోగి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా తెలుసుకునేందుకు దోహదపడుతుంది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందించిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇటీవల బ్లూటూత్ కాంటాక్ట్స్ ఆధారంగా ప్రమాద స్థాయిని అంచనా వేసే లక్షణాన్ని కూడా ఆరోగ్యా సేతు డెవలపర్లు పొందుపరిచారు. తాజాగా ఆరోగ్య సేతులో హెల్త్ డేటాను ఇతర హెల్త్ యాప్‌లలో షేర్ చేసేందుకు కొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. అయితే ఈ మార్పులన్నీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని త్వరలో పొందనున్నారు. (సాహో.. ఆరోగ్య సేతు..!)
అకౌంట్ డిలీట్ చేసే విధానం
యాప్‌లో ఎడమవైపు ఉన్న యూజర్ ఐకాన్‌ను క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌ను రూపొందించడం. స్కాన్ చేయడం, ప్రభుత్వంతో డేటాను భాగస్వామ్యం చేయడం, కాల్ హెల్ప్‌లైన్ (1075), సెట్టింగ్ ఆప్షన్లు కన్పిస్తాయి. వీటిలో సెట్టింగ్‌ను క్లిక్ చేసి డిలీట్ మై అకౌంట్‌పై నొక్కాలి. అప్పుడు అకౌంట్‌ను డిలీట్ చేస్తే ఏం అవుతుందో చూపిస్తుంది. దాన్ని ఓకే చేసి మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో యాప్‌లో మీ అకౌంట్ డిలీట్ అవుతోంది. (ఆరోగ్య సేతు ఉంటేనే ఏపీ సచివాలయంలోకి..)
Comments
Please login to add a commentAdd a comment