
Mythri Movie Makers Released Pushpa Deleted Scene: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతుంది. టాలీవుడ్‌లో రూ. 100కోట్లకు పైగా కలక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ సహా ఇతర భాషల్లోనూ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ సినిమా. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప చిత్రం నుంచి డిలీటెడ్ సీన్‌ని విడుదల చేశారు.
ఇందులో.. అప్పు ఇచ్చిన వ్యక్తికి బర్రెలు అమ్మి అయినా అప్పు తీర్చేస్తాడు పుష్పరాజ్.ఈ క్రమంలో అప్పు చెల్లించినట్లు ఊరందరికి చెప్పాలంటూ అతడిపై చేయిచేసుకుంటాడు. అయితే లెంగ్త్ ఎక్కువైన కారణంగా ఈ సీన్‌ను చిత్రం నుంచి తొలగించారు. తాజాగా పుష్ప డిలీటెడ్ సీన్‌లో ఈ వీడియోను రిలీజ్ చేయగా కాసేపటికే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ సీన్ ఉంటే థియేటర్ దద్దరిల్లిపోయేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.