Pushpa Movie Two Days Box Office Collections: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద దమ్మురేపుతుంది. డిసెంబర్17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తొలిరోజే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. చదవండి: స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఎందుకు ఒప్పుకుందో తెలుసా?
అలా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది 'పుష్ప'.అంతేకాకుండా మూడో రోజు కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం. కాగా ఫిబ్రవరిలో ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.
చదవండి:Pushpa Move : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 'పుష్ప'.. బాక్సాఫీస్ ప్రభంజనం
Bigg boss 5 Telugu: బిగ్‌బాస్ స్టేజ్‌పై బాలయ్య డైలాగ్ చెప్పిన ఆలియాభట్
Comments
Please login to add a commentAdd a comment